logo

దళితులపై దాడి కేసులో డీఎస్పీ సుభాష్‌ దర్యాప్తు

పెదపులిపాకలో దళితులపై వైకాపా దాడి కేసుపై బుధవారం డీఎస్పీ సుభాష్‌ బుధవారం దర్యాప్తు చేపట్టారు. గత ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు..

Published : 09 May 2024 04:05 IST

బాధితుని విచారిస్తున్న డీఎస్పీ సుభాష్‌, సీఐ రామారావులు

పెదపులిపాక (పెనమలూరు), న్యూస్‌టుడే: పెదపులిపాకలో దళితులపై వైకాపా దాడి కేసుపై బుధవారం డీఎస్పీ సుభాష్‌ బుధవారం దర్యాప్తు చేపట్టారు. గత ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు.. పెనమలూరు పోలీసులు మంత్రి జోగి రమేష్‌ కుమారుడు రాజీవ్‌, పెదపులిపాకకు చెందిన వైకాపా కార్యకర్తలు రబ్బాని, మాబు సుభాని, ఫరీద్‌బాషా, సుభాని, మరో ముగ్గురిపై కులదూషణ, దాడి కేసులు నమోదు చేశారు. ఉన్నతాధికారులు ఈ కేసు విచారణ బాధ్యతలను డీఎస్పీ సుభాష్‌కు అప్పగించారు. దీంతో సుభాష్‌ బుధవారం గ్రామానికి చేరుకొన్నారు. సీ‡ఐ రామారావుతో కలిసి విచారణ జరిపారు. సంఘటనపై  బాధితులు, స్థానికులను వీరు పలు కోణాల్లో విచారించారు. సంఘటన ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది? ఎంతమంది పాల్గొన్నారు అన్న వివరాలను వీరు బాధితుల నుంచి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తును వేగంగా చేయనున్నట్లు డీఎస్పీ వివరించారు. గ్రామ రెవెన్యూ అధికారి దేవసహాయం దర్యాప్తులో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని