logo

17,150 మంది ఓటు హక్కు వినియోగం

ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న 17,150 మంది పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.

Published : 09 May 2024 04:10 IST

కలెక్టరేట్‌ (మచిలీపట్నం), న్యూస్‌టుడే: ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న 17,150 మంది పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. పోలింగ్‌ సిబ్బంది, పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది పోస్టల్‌ బ్యాలట్ కోసం 4వ తేదీ నుంచి ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రాల గడువు బుధవారంతో ముగిసింది. 85 సంవత్సరాల వయస్సు నిండిన వృద్ధులు, దివ్యాంగుల కోసం నిర్వహించిన హోం ఓటింగ్‌ ప్రక్రియా ముగిసింది. హోం ఓటింగ్‌ కోసం జిల్లా వ్యాప్తంగా 1,762 దరఖాస్తులు అందగా 1,724 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

నేడు పోలీస్‌ సిబ్బందికి అవకాశం

ఈనెల 7, 8 తేదీల్లో ప్రధాని బందోబస్తు విధుల్లో పాల్గొని పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోలేని పోలీస్‌ సిబ్బంది కోసం ఎన్నికల సంఘ ఆదేశాల మేరకు గురువారం సంబంధిత నియోజకవర్గాల్లో ప్రత్యేక ఫెసిలిటేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డీకే బాలాజీ స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని పోలీస్‌ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటన ద్వారా సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు