logo
Published : 28/11/2021 03:10 IST

సమస్యలకు పరిష్కారమేదీ ?

మాస్టార్లకు యాప్‌ సోపాలు
ఈనాడు-అమరావతి

జిల్లాలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల్లో స్టూడెంట్‌ యాప్‌ గుబులు రేకెత్తిస్తోంది. అది  సవ్యంగా పనిచేయటంలేదని గగ్గోలు పెడుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేయలేదు. శనివారం తిరిగి బాగానే పనిచేసింది. ఒక రోజు పనిచేసి ఒకరోజు పనిచేయక ఇబ్బందులు పడుతున్నామని, సమస్యలు లేకుండా యాప్‌ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాద్యాయులు కోరుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం అమ్మఒడికి 75 శాతం హాజరు ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల హాజరు కూడా స్టూడెంట్‌ యాప్‌లోనే నమోదు చేయాలని ఈనెల 8న ఉత్తర్వులిచ్చింది. ఈనెల 17 నుంచి జిల్లాలో దాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. హాజరు వేసే క్రమంలో తరచూ యాప్‌ మొరాయిస్తోందని చెబుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవటం లేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం అమ్మఒడి లబ్ధికి యాప్‌ హాజరునే  ప్రామాణికంగా తీసుకుంటే యాప్‌ పనిచేయని రోజున హాజరును ఎలా పరిగణనలోకి తీసుకుంటారో స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. జిల్లాలో 3576 పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాద్యాయులు, ఉపాధ్యాయులు ఈ యాప్‌ విషయమై ఆందోళన చెందుతున్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని