Published : 28 Nov 2021 03:38 IST
ఆదుకోవాలని వేడుకోలు
రూ.వేలల్లో వెచ్చించి వరి సాగు చేశామని.. పంట చేతికందొచ్చే సమయంలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో పంట నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పైరు రోజుల తరబడి నీటిలో ఉండటంతో పలు చోట్ల మొలకలొచ్చి తీవ్రంగా నష్టం వాటిల్లిందన్నారు. నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని శనివారం పామర్రు మండలం ప్రాకెర్ల, నెమ్మలూరు, ఎలకుర్రుపరిధిలోని దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించేందుకు వచ్చిన పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ వద్ద పలువురు అన్నదాతలు వాపోయారు. దీనిపై ఆయన స్పందిస్తూ నీటమునిగి పాడైన వరి పొలాలను వ్యవసాయ శాఖాధికారులు గుర్తించి అంచనా వేయాలని ఆదేశించారు.
- న్యూస్‌టుడే, గ్రామీణ పామర్రు
Tags :