logo
Updated : 28 Nov 2021 03:39 IST

734 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

‘ఈనాడు- మీ తోడు’లో జేసీ మాధవీలత
సూర్యారావుపేట, న్యూస్‌టుడే

రీఫ్‌ సీజన్‌లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని 734 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని జేసీ డాక్టర్‌ కె.మాధవీలత పేర్కొన్నారు. శనివారం జేసీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ‘ఈనాడు- మీ తోడు’ కార్యక్రమానికి రైతుల నుంచి విశేష స్పందన లభించింది. జేసీ మాధవీలతతో నేరుగా ఫోన్లో మాట్లాడి, తమ సమస్యలను వివరించారు. కామన్‌ రకం ధాన్యం క్వింటాకు రూ.1940లు, గ్రేడ్‌ ‘ఏ’ రకం ధాన్యం రూ.1960లుగా మద్దతు ధర నిర్ణయించినట్లు మాధవీలత తెలిపారు. మిల్లర్లు దౌర్జన్యంగా తక్కువ మద్దతు ధర ఇస్తామంటే ఊరుకునేది లేదని పేర్కొన్నారు.  క్వింటాకు ఒక కిలో మాత్రమే తగ్గించాలని, అంతకన్నా తగ్గిస్తే సదరు మిల్లర్లను బ్లాక్‌ లిస్ట్‌లో పెడతామని జేసీ హెచ్చరించారు.

వరి కోతలు మొదలు పెట్టాం. ఆర్‌బీకేలో కొనుగోలుకు ఇంకా అనుమతులు రాలేదని చెబుతున్నారు.

- జాస్తి శ్రీనివాసరావు, చందర్లపాడు మండలం చింతలపాడు

సమాధానం : కొనుగోలు చేయమని ఆదేశాలు జారీ చేస్తాం.

సాంబమసూరి రకం.. నిబందనల మేరకు తేమ శాతం ఉంది. కానీ మా ప్రాంతంలో మిల్లులు  తెరవలేదు. ఇంకా కళ్లంలోనే ధాన్యం ఉంది.  కొనుగోలుకు తమకు అనుమతి ఇంకా రాలేదని మిల్లర్లు చెబుతున్నారు. ఆర్‌బీకేల్లో సిబ్బంది కొరత ఉందని చెబుతున్నారు.

- లగడపాటి శ్రీహరిరావు, కొండూరు గ్రామం

సమాధానం : వెంటనే రైతుభరోసా కేంద్రానికి వెళ్లండి. తేమ శాతం లెక్కించుకుని టోకెన్‌ తీసుకుంటే మీ వద్ద ధాన్యం కొనుగోలు చేస్తారు.

నందిగామ మండలం కొరతమాత్మకూరులో రైతులు ధాన్యం కోశారు. ఇక్కడ కొనుగోలు కేంద్రం ఉంది. కానీ ప్రారంభించలేదు.  

- భాస్కరరావు

సమాధానం :వెంటనే ప్రారంభిస్తాం.

గుమ్మడిదరువు, అనిగండ్లపాడు ప్రాంతాల్లో ఇంకా ధాన్యం కొనుగోలు ప్రారంభం కాలేదు.  వంతమాదుగురు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా అందుబాటులోకి రాలేదు. గోనె సంచులు రాలేదు. బి.పి.టి.లకు బయటే ఎక్కువ ధర పలుకుతోంది. కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభిస్తే రైతులకు ఉపయోగం.

- చుండూరు సుబ్బారావు, నందిగామ

సమాధానం : రైతులు తమ పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు. బి.పి.టి. ధాన్యానికి ఆర్‌బీకేలో కన్నా బయటే ఎక్కువ ధర వస్తుంటే.. అక్కడే అమ్ముకునే వెసులుబాటు ఉంది. ఆయా ప్రాంతంలో వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తాం. ముందుగా తేమ శాతం నిర్ధారించుకోండి. సిబ్బంది ఇచ్చిన తేదీ ప్రకారం వెళ్లి రైతుభరోసా కేంద్రంలో అమ్ముకోండి.

మోపిదేవి, శివరాంపురం ప్రాంతాల్లో 25 ఎకరాల్లో 1224 వరి వేశాం. మిల్లర్లు ముందుకు రావటం లేదు. కోత కోయలేదు. పచ్చి ధాన్యం కొనుగోలు చేస్తే బాగుంటుంది. మరో రెండు రోజుల్లో వర్షాలు పడతాయని  అంటున్నారు.  ఆరబెట్టి అమ్మాలంటే ఇపుడు సాధ్యమయ్యేలా లేదు.

- మల్లంపాటి ప్రేమానంద మోహన్‌

సమాధానం : ప్రభుత్వం అనుమతించిన రకాల్లో 1224 కూడా ఉంది. దీనినీ కొనుగోలు చేయాల్సిందే. మీ ప్రాంతంలోని ఆర్‌బీకేలో సంప్రదించండి. కొనుగోలు చేయాలని వారికి మేం చెబుతాం.

మాకు సంచులు అందటం లేదు. బ్రోకర్లు మిల్లర్ల వద్ద సంచులు తెచ్చి, మాకు ఇస్తున్నారు. దళారులు కొన్ని చోట్ల కొనుగోలు చేస్తున్నారు. అమ్మిన తర్వాత 2, 3 నెలలకు కూడా డబ్బులు ఇవ్వటం లేదు.

- డి.శివశంకరావు, మురళి, నెక్కలపూడి, తోట్లవల్లూరు

సమాధానం : అందరికీ సరిపడా సంచులు పంపిణీ చేస్తాం. బ్రోకర్లకు ధాన్యం అమ్మనవసరం లేదు. ఆర్‌బీకేల ద్వారానే అమ్ముకోండి. విక్రయించిన ధాన్యానికి 21 రోజుల్లో, వారి ఖాతాల్లో డబ్బులు నేరుగా జమ చేస్తాం.


కంట్రోల్‌రూం ఏర్పాటు

ప్రతి డివిజన్‌ పరిధిలో ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు ఒక కంట్రోల్‌రూం ఏర్పాటు చేశాం. టోల్‌ ఫ్రీ నెంబర్లు 1901, 155251 ఏర్పాటు చేశాం. జిల్లా కంట్రోల్‌రూం నెంబరు 1800 425 4402కు సైతం సమాచారం ఇవ్వొచ్చు. వీటితో పాటు ప్రతి డివిజన్‌ పరిధిలో అధికారులను ఏర్పాటు చేశాం.


అవగాహన కలిగించాలి

కొనుగోలు కేంద్రాలు పెట్టారు. ఎంత మద్దతు ధర పెట్టారు? సంచులు ఇస్తున్నారా? వీటినన్నింటినీ ప్రచారం చేయండి. కొనుగోలు కేంద్రాల గురించి టమకా వేయండి. ఆర్‌బీకే ద్వారా ఎలా అమ్ముకోవాలి? ప్రతి గ్రామంలో సాయంత్రం వేళ సదస్సులు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.

- శీలం ప్రకాశరావు, తోట్లవల్లూరు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని