logo
Published : 02 Dec 2021 05:03 IST

ఆరోగ్య వర్సిటీ నిధులు బదలాయించొద్దు


ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి వినతిపత్రం అందజేస్తున్న పీడీఎస్‌యూ నాయకులు

కొత్త ఆస్పత్రి కూడలి, న్యూస్‌టుడే: డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి చెందిన రూ.400 కోట్లు నిధులు ఏపీ స్టేట్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు బదలాయింపు చేయొద్దని కోరుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) నాయకులు బుధవారం ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నానిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రవిచంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌ జాతీయ బ్యాంకు కాదని స్పష్టం చేశారు. ఏటా విశ్వవిద్యాలయానికి రూ.68 కోట్లు ఖర్చు అవుతుందని, దీనికి ప్రభుత్వం ఏటా రూ.5కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటుందన్నారు. ఉద్యోగుల జీతభత్యాలు, పింఛను, వర్సిటీ అభివృద్ధి ఇతర అవసరాలకు నిధులు వెచ్చించకుండా ప్రభుత్వం రూ.400కోట్లు లాక్కోవడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ విశ్వవిద్యాలయ నిధులను వర్సిటీ సంక్షేమానికే ఖర్చు పెడుతుందన్నారు. ప్రభుత్వం నేరుగా నిధులను తీసుకోలేదన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.రామ్మోహన్‌, ఉపాధ్యక్షులు ఈ.భూషణం, కె.నాని, ఎన్‌.వి.మహర్షి, ఐ.రాజేష్‌ పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :
వీక్షకులకు గమనిక
ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని