logo
Published : 03/12/2021 04:57 IST

సంపద సృష్టిపై దృష్టి

వినియోగంలోకి చెత్త నిర్వహణ కేంద్రాలు
న్యూస్‌టుడే - గంపలగూడెం, తాడిగడప

మేడూరులో కేంద్రానికి రంగులు

జిల్లాలో చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలు కొత్త కళను సంతరించుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో నిర్మించిన చెత్త నిర్వహణ కేంద్రాలకు గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో మరమ్మతులు చేయించి రంగులు వేయిస్తున్నారు. 2017-18లో జిల్లాలోని 970 గ్రామాల్లో జనాభా ప్రాతిపదికన రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వ్యయం చేసి చెత్త నిర్వహణ కేంద్రాలను నిర్మించారు. అప్పట్లో కొన్ని గ్రామాల్లో ఆర్భాటంగా ప్రారంభించి చెత్తను సేకరించారు. హరిత రాయబారులను నియమించారు. ఏడాదికే కేంద్రాల నిర్వహణ చతికిలపడింది. సిబ్బందికి వేతనాలు రాలేదు.


రెండు రంగులకు అనుమతి

ప్రస్తుతం గ్రామాల్లోని ఈ కేంద్రాలకు మరమ్మతులు చేసి, రంగులు వేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వారం రోజుల నుంచి గ్రామ సచివాలయ ఉద్యోగులు, మండల స్థాయి అధికారులు వీటిపై దృష్టి సారించి పనులు చేయిస్తున్నారు. ఒక్కో కేంద్రానికి రూ.12 వేల నుంచి రూ. 20 వేల వరకు రంగులకు కేటాయించారు. గోడలకు, పిట్‌లకు వాటర్‌ ప్రూఫ్‌ సిమెంట్‌ రంగులు, ఇనుప కమ్మీలకు సింథటిక్‌ ఎనామిల్‌ రంగులు వేయాలి. అందుబాటులో ఉన్న రెండు రంగులు వాడొచ్చు. ఇవి సిద్ధం కాగానే గ్రామాల్లో చెత్తను అక్కడకు తరలించి సంపద సృష్టికి కార్యాచరణ మొదలుపెట్టాల్సి ఉంటుంది.


కార్పొరేషన్‌ నుంచి వేతనాలు

గ్రామాలో పారిశుద్ధ్య సమస్య పరిష్కారం, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ నిధులతో పంచాయతీల్లో చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాల నిర్మాణం చేపట్టారు. షెడ్‌లు, కుండీలు నిర్మించారు. ఇంకా కొన్ని పంచాయతీల్లో ఇవి అసంపూర్తిగా ఉన్నాయి. మరికొన్ని చోట్ల పలు వివాదాల వల్ల నిర్మాణం కాలేదు. పూర్తయిన వాటిలో సంపద సృష్టి మొదలు కాలేదు. ఇప్పుడు జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఈ కేంద్రాలను కచ్చితంగా వాడుకలోకి తేవాలని ఆదేశాలు వచ్చాయి. ప్రతి పంచాయతీలోనూ విధిగా వినియోగించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్వచ్ఛభారత్‌, స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్‌లో బాగంగా నియమితులైన గ్రీన్‌ అంబాసిడర్ల (హరిత రాయబారులు) పేరును ఇప్పుడు ‘క్లాప్‌మిత్ర’గా మార్చారు. వీరికి స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌ నుంచి వేతనాలు చెల్లించేలా ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో ప్రతిరోజు 250 గృహాలకు ఒక క్లాప్‌మిత్ర అవసరం ఉంటుందని భావిస్తున్నారు. జిల్లాలో గతంలో 2 వేల మంది వరకు హరిత రాయబారులు ఉండేవారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని