logo

ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి

బాలిక హత్య కేసులో శిక్ష పడుతుందని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. జూలకల్లుకు చెందిన సాతులూరి ఫణికుమార్‌(42)కు భార్యతో

Published : 09 Dec 2021 04:05 IST

హత్య కేసులో శిక్ష పడుతుందని

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: బాలిక హత్య కేసులో శిక్ష పడుతుందని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. జూలకల్లుకు చెందిన సాతులూరి ఫణికుమార్‌(42)కు భార్యతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నాడు. అతను ఉపాధి కోసం హైదరాబాద్‌ వెళ్లి ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో ఓ మహిళ భర్తకు దూరంగా ఉంటూ ఇళ్లల్లో పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆమెకు ఆరేళ్ల కుమార్తె ఉంది. ఈ నేపథ్యంలో ఫణికుమార్‌ ఆమెతో కలిసి హైదరాబాద్‌ సమీపంలోని ఉమామహేశ్వరి కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఏడాది పాటు అక్కడే ఉన్నారు. అనంతరం గ్రామంలో జరిగే తిరునాళ్లకని జూలకల్లుకు వచ్చారు. ఈ క్రమంలో మహిళ కుమార్తెను అతను పలక తీసుకొని కొట్టడంతో మృతిచెందింది. మృతదేహాన్ని దుర్గి మండలం అడిగొప్పల దగ్గర క్వారీ గుంతల్లో పడేసి వచ్చారు. బాలిక మృతదేహం బయట పడటంతో దుర్గి పోలీసులు విచారణ చేసి అతనిపై కేసు నమోదు చేశారు. కోర్టులో విచారణకు వచ్చింది. ఆ కేసులో శిక్ష పడుతుందని అతను మంగళవారం ఇంట్లో పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అనంతరం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు.


ఆటోడ్రైవరు బలవన్మరణం

మాచర్లగ్రామీణ, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులతో ఆటోడ్రైవరు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మాచర్లలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... పట్టణంలోని రింగురోడ్డు గౌడకాలనీకి చెందిన మేకపోతుల మారుతి(45) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. అప్పులు అధికం కావడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. మానసిక ఒత్తిడికిలోనై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని