logo

జపాన్‌ బూట్లు... ఆపేను పాము కాట్లు

పొలంలో పాముకాట్ల నుంచి తప్పించుకోడానికి ఆ రైతు వినూత్నమైన విరుగుడు ఏర్పాటు చేసుకున్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరుకు చెందిన బాల శశికాంత్‌ ప్రత్యేకమైన బూట్లు వినియోగిస్తున్నారు.

Published : 18 Jan 2022 06:21 IST

ఈటీవీ-అమరావతి

జపాన్‌ బూట్లు చూపిస్తున్నరైతు బాలశశికాంత్‌

పొలంలో పాముకాట్ల నుంచి తప్పించుకోడానికి ఆ రైతు వినూత్నమైన విరుగుడు ఏర్పాటు చేసుకున్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరుకు చెందిన బాల శశికాంత్‌ ప్రత్యేకమైన బూట్లు వినియోగిస్తున్నారు. యూ ట్యూబ్‌లో వీడియో చూసి వీటిని హైదరాబాద్‌ నుంచి తెప్పించినట్లు ఆయన తెలిపారు. వీటి ధర రూ.13 వందలు.  పైరుకు మందు చల్లే సమయంలో పాములు, ఇతర విషపురుగుల నుంచి రక్షణ కోసం వీటిని కొన్నట్లు శశికాంత్‌ తెలిపారు. శశికాంత్‌ తన పొలంలో మిరప సాగు చేశారు. తామరపురుగుల దాడి నుంచి పంటను కాపాడేందుకు రాత్రిసమయంలో మందులు పిచికారీ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇబ్బంది లేకుండా ఇవి బాగా ఉపయోగపడినట్లు చెప్పారు. పై భాగంలో ఉన్న బెల్టుని మన నడుముకు కట్టుకుంటే కిందకు రాకుండా అలాగే ఉండిపోతాయని వివరించారు. జపాన్‌ బూట్లుగా పిలిచే వీటితో బురద పొలాల్లో కూడా సులువుగా నడవొచ్చు. సాధారణంగా ఈ తరహా బూట్లు విదేశాల్లో వరి పండించే రైతులు ఎక్కువగా ఉపయోగిస్తారు. అందుకే వీటిని పాడీ షూస్‌ అని కూడా పిలుస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని