logo

ఉప రాష్ట్రపతికి ఘన వీడ్కోలు

ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు జిల్లాలో తన పర్యటన ముగించుకుని విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు. బుధవారం తెల్లవారుజామున ఆత్కూరులోని

Published : 20 Jan 2022 03:29 IST

ఉప రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు జిల్లాలో తన పర్యటన ముగించుకుని విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు. బుధవారం తెల్లవారుజామున ఆత్కూరులోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ నుంచి వాహన శ్రేణిలో నూజివీడు రైల్వేస్టేషన్‌కు వచ్చిన ఆయన సరిగ్గా ఉదయం 6.06 గంటలకు నూజివీడు స్టేషన్‌లో ప్రత్యేక రైలులో ఎక్కారు. తొలుత పోలీసు బలగాలు గౌరవ వందనంతో ఉప రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం ఒకటో ప్లాట్‌ఫాం చేరుకున్న ఆయనకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, కలెక్టర్‌ జె.నివాస్‌, గవర్నర్‌ కార్యదర్శి ఆర్పీ సిసోడియా, డీఐజీ కేవీ మోహనరావు, ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌, రైల్వే డీఆర్‌ఎం శివేంద్రమోహన్‌ తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి వీడ్కోలు పలికారు. దేశంలోనే మూడో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి తొలిసారిగా నూజివీడు రైల్వేస్టేషన్‌కు రావడం ప్రత్యేకత సంతరించుకుంది. వెంకయ్యనాయుడు రాక సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టారు. ప్రోటోకాల్‌ డైరెక్టర్‌ బాల సుబ్రమణ్యంరెడ్డి, అదనపు డైరెక్టర్‌ శర్మ, ఆర్డీవో రాజ్యలక్ష్మీ, నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్‌ కిరణ్‌, రైల్వేస్టేషన్‌ సూపరింటెండెంట్‌ రాజేంద్రబాబు, తదితరులు ఉప రాష్ట్రపతికి వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని