logo

నియోజకవర్గానికో కొవిడ్‌ కేర్‌ కేంద్రం

జిల్లాలో కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా పాజిటివ్‌ కేసులు, పట్టణాలతో పాటు గ్రామాలకు విస్తరిస్తోంది. మూడో దశ వేగంగా విస్తరిస్తున్నందున తొలి దశలో ప్రతి ని

Published : 22 Jan 2022 03:34 IST

అడవి తక్కెళ్లపాడులో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: జిల్లాలో కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా పాజిటివ్‌ కేసులు, పట్టణాలతో పాటు గ్రామాలకు విస్తరిస్తోంది. మూడో దశ వేగంగా విస్తరిస్తున్నందున తొలి దశలో ప్రతి నియోజకవర్గ పరిధిలో కనీసం ఒక కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను తక్షణమే ప్రారంభించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించారు. వైరస్‌ బారిన పడిన బాధితులను ఈ కేంద్రాలకు ఉచితంగానే తరలించనున్నారు. పైసా ఖర్చు లేకుండా ఉచితంగా చికిత్స అందించే బాధ్యతలను తీసుకుంటారు. వ్యాధి తీవ్రతను బట్టి వారిని ఏ ప్రభుత్వాసుపత్రికి తరలించాల్లో నిర్ణయం తీసుకుంటారు. డీఎంహెచ్‌వో యాస్మిన్‌ పర్యవేక్షణలో వైద్య ఆరోగ్య శాఖ నుంచి జిల్లా నోడల్‌ అధికారిగా డాక్టర్‌ లక్ష్మానాయక్‌ వ్యవహరించనున్నారు. అవసరమైన వారు 94404 65388లో సంప్రదించవచ్చు.

బాధితులకు ఉపశమనం

కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కేంద్రాల్లో బాధితులకు ఉపశమనం దక్కనుంది. వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తల పర్యవేక్షణలో ఈ కేంద్రాలు పని చేయనున్నాయి. ఈ కేంద్రాల్లో చేరిన వారికి ఆరోగ్య సలహాలు, సూచనలు, చికిత్స అందించనున్నారు. రోగులకు ఉచిత భోజనం, మందులు, వసతి సదుపాయాలు కల్పిస్తున్నారు. వైరస్‌ బారిన పడిన వారు బయట తిరగకుండా ఈ కేంద్రాలకు తరలించడం వల్ల కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు.

104కి ఫోన్‌ చేస్తే

104 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేస్తే వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎక్కడ చేస్తున్నారు? కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి? ఏ ఆసుపత్రిలో పడకలు అందుబాటులో ఉన్నాయి తదితర సమాచారం లభిస్తోంది. ఇళ్లలో తగిన సదుపాయాలుండి హోం క్వారంటైన్‌లో ఉన్నవారికి ప్రభుత్వమే ఉచితంగా ఔషధాలు, వైద్యుల సలహాలు అందేవిధంగా ఏర్పాట్లు చేశారు.

అందుబాటులో 3వేల పడకలు

జిల్లాలో అన్ని కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో 3 వేల పడకలు అందుబాటులోకి రానున్నాయి. తొమ్మిది కేంద్రాలను ఇప్పటికే గుర్తించాం. మిగిలిన ఎనిమిది రెండు రోజుల్లో గుర్తిస్తాం. ఇప్పటికే గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గాలకు సంబంధించిన కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మిగిలినవి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. కొవిడ్‌ కేర్‌ కేంద్రాలకు వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి అవసరమైతే వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపుతాం. గుంటూరు జీజీహెచ్‌తో పాటు తెనాలి జిల్లా ఆసుపత్రి, అన్ని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో బాధితులకు చికిత్స అందుతుంది.

- డాక్టర్‌ లక్ష్మానాయక్‌, జిల్లా నోడల్‌ అధికారి

కొవిడ్‌ కేర్‌ కేంద్రాల వివరాలు

నియోజకవర్గం పడకలు సెంటర్‌ పేరు
గుంటూరు తూర్పు 300 ఏపీ టిడ్కో అడవి తక్కెళ్లపాడు
గుంటూరు పశ్చిమ 300 ఏపీ టిడ్కో అడవి తక్కెళ్లపాడు
ప్రత్తిపాడు 100 క్రిష్టియన్‌ కమ్యూనిటీ హాల్‌,
అడవి తక్కెళ్లపాడు
తెనాలి 500 ఏపీ టిడ్కో, తెనాలి
నరసరావుపేట 200 ఏపీ టిడ్కో, నర్సరావుపేట
బాపట్ల 100 ఏపీహెచ్‌ఆర్‌డీఐ
అమరావతి 100 ఏపీ టూరిజం హరితా రిసార్ట్‌
(పెదకూరపాడు)
వినుకొండ 100 సెయింట్‌ జేవియర్స్‌ క్యాంపస్‌
చిలకలూరిపేట 300 ఏపీ టిడ్కో, చిలకలూరిపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని