logo

జగన్‌ పాలనలో సామాజిక న్యాయం: బూడి

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే ఎస్సీ, ఎస్టీ, బీసీ,. మైనార్టీలకు సామాజిక గుర్తింపునిచ్చిన ఘనత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని ఉప ముఖ్యమంత్రి

Updated : 23 May 2022 04:45 IST

మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు

దేేవరాపల్లి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే ఎస్సీ, ఎస్టీ, బీసీ,. మైనార్టీలకు సామాజిక గుర్తింపునిచ్చిన ఘనత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు వ్యాఖ్యానించారు. తారువలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. వైకాపా తరఫున రెండు సార్లు రాజ్యసభ సీట్ల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. వైకాపా ప్రభుత్వం తొలి, మలివిడత మంత్రివర్గ విస్తరణల్లో సామాజిక న్యాయాన్ని పాటించడమే కాకుండా అత్యున్నతమైన ఉప ముఖ్యమంత్రి పదవి సహా వివిధ మంత్రి పదవులిచ్చి ఎస్సీ, ఎస్టీ. బీసీ, మైనార్టీలతో పాటు అందరి మన్ననలు పొందిందన్నారు. ఈ సామాజిక వర్గాలకు జగన్‌ పెద్దపీట వెయ్యడాన్ని చూసి ఓర్వలేని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుతోపాటు కొంతమంది ఇతర పార్టీల నాయకులు అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నారని బూడి పేర్కొన్నారు. వివిధ బీసీ కార్పొరేషన్లకు ఛైర్మన్‌ పదవులు, పాలకవర్గ సభ్యుల్ని నియమించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీ స్థానాల కేటాయింపులో సైతం సామాజిక న్యాయాన్ని పాటించామన్నారు. గత ప్రభుత్వాలు తమలాంటి సామాజిక వర్గాలకు చెందిన వారందరి సేవల్ని వాడుకోవడం తప్ప, ఏనాడూ తగిన గుర్తింపు ఇవ్వలేకపోయాయని విమర్శించారు. ఆ అక్కసుతో చంద్రబాబులాంటి నాయకులకు ఏం మాట్లాడాలో అర్థంకాక ఏవేవో మాట్లాడుతున్నారని, వారి మాటల్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు ఏ రకమైన మేలు జరిగిందో వివరించడానికే ఈ నెల 26 నుంచి 29 వరకు బస్సుయాత్ర చేయనున్నట్లు చెప్పారు. కె.కోటపాడు ఎంపీపీ రెడ్డి జగన్‌మోహన్‌, దేవరాపల్లి జడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని