logo

ఆనందాలు రాశిగా పోద్దాం!

విడపనకల్లు, ఉరవకొండ మండలాల్లో తుంగభద్ర ఎగువ కాలువ, జీబీసీ, హంద్రీ-నీవా కాలువల కింద సాగైన వివిధ రకాల పంటలు సంక్రాంతి పండగను మోసుకొస్తున్నాయి. మరో వైపు వర్షాధారంగా సాగయిన వివిధ పంటల పచ్చదనంతో పొలాలకు పచ్చని రంగేసినట్లు కనిపిస్తున్నాయి.

Published : 15 Jan 2022 05:50 IST


రాయంపల్లి వద్ద పొలాల్లో ధాన్యం  

విడపనకల్లు, ఉరవకొండ మండలాల్లో తుంగభద్ర ఎగువ కాలువ, జీబీసీ, హంద్రీ-నీవా కాలువల కింద సాగైన వివిధ రకాల పంటలు సంక్రాంతి పండగను మోసుకొస్తున్నాయి. మరో వైపు వర్షాధారంగా సాగయిన వివిధ పంటల పచ్చదనంతో పొలాలకు పచ్చని రంగేసినట్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పొలాల్లో వ్యవసాయ పనులు సాగుతుండగా, కూలీల సందడి కనిపిస్తోంది. దీనికి తోడు పొలాల్లో పక్షుల కిలకిలా రావాలు ఆనందాన్ని పంచుతున్నాయి. వరి పంట చేతికి వస్తున్న వేళ పొలాల్లో వరి రాశులు దర్శనం ఇస్తున్నాయి. - న్యూస్‌టుడే, ఉరవకొండ  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని