logo

తవ్వేశారు.. తరలించేశారు!

ప్రభుత్వ భూముల్లోని మట్టిని కొందరు వైకాపా నాయకులు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

Published : 06 Feb 2023 03:44 IST

ప్రభుత్వ భూమిలో యంత్రంతో మట్టి తవ్వకాలు

యల్లనూరు (పుట్లూరు), న్యూస్‌టుడే: ప్రభుత్వ భూముల్లోని మట్టిని కొందరు వైకాపా నాయకులు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. యల్లనూరు మండలం వెంకటాంపల్లి రెవెన్యూ గ్రామంలోని ప్రభుత్వ భూముల్లోని మట్టిని యథేచ్ఛగా తరలించేస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఓ వైకాపా నాయకుడు ప్రభుత్వ భూముల్లోని మట్టిని ట్రిప్పు రూ.5 వందల నుంచి రూ.6 వందల వరకూ అమ్ముతున్నట్లు తెలుస్తోంది. సుమారు వంద ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిలో మట్టిని తవ్వి రోజూ 120 నుంచి 150 ట్రిప్పుల్లో తరలిస్తున్నారు. గురజాల గ్రామానికి వెళ్లే రహదారి సమీపంలోని భూముల్లోని మట్టిని నిత్యం తవ్వి అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దాదాపు  వారం రోజులుగా ఈ తతంగం జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారు. ఈ విషయాన్ని స్థానిక వీఆర్‌ఓ భీమరామలింగేశ్వరరెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా.. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆదివారం సాయంత్రం మట్టి రవాణా జరగకుండా నిలిపి వేశామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని