logo

సందడిగా ‘అలా ఇలా ఎలా’ చిత్రం ట్రైలర్‌ విడుదల

కళా మూవీ మేకర్స్‌ ఆధ్వర్యంలో కొల్లకుంట వడ్డే నాగరాజు నిర్మాతగా, దర్శకుడు రాఘవ చిత్రీకరించిన ‘అలా ఇలా ఎలా’ సినిమా ట్రైలర్‌, పాటల విడుదల హిందూపురం ఆర్కే ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం రాత్రి సందడిగా సాగింది.

Published : 26 Jun 2023 04:25 IST

ట్రైలర్‌, పాటల విడుదల కార్యక్రమానికి హాజరైన కథానాయకుడు శక్తి, కథానాయిక నిశ్చిత కొటారి, నిర్మాత వడ్డే నాగరాజు, దర్శకుడు రాఘవ, ఎమ్మెల్సీ మహ్మద్‌ఇక్బాల్‌, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘని తదితరులు

హిందూపురం అర్బన్‌, న్యూస్‌టుడే: కళా మూవీ మేకర్స్‌ ఆధ్వర్యంలో కొల్లకుంట వడ్డే నాగరాజు నిర్మాతగా, దర్శకుడు రాఘవ చిత్రీకరించిన ‘అలా ఇలా ఎలా’ సినిమా ట్రైలర్‌, పాటల విడుదల హిందూపురం ఆర్కే ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం రాత్రి సందడిగా సాగింది. చిత్రం కథానాయకుడు శక్తి, కథానాయిక నిశ్చిత కొటారి, దర్శకుడు రాఘవ, ఎమ్మెల్సీ మహ్మద్‌ఇక్బాల్‌, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘని, చిత్ర నిర్మాత నాగరాజు, కళామూవీ మేకర్స్‌ హరి, బాలాజీ మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహ్మద్‌ఇక్బాల్‌ మాట్లాడుతూ  కొల్లకుంటకు చెందిన వడ్డే నాగరాజు ఈ చిత్రం నిర్మించటం ఆనందంగా ఉందని, చిత్రం విజయవంతమై భవిష్యత్తులో మరిన్ని పెద్ద సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం సినిమా ఆడియోను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు మణిశర్మ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని