logo

Kethireddy Peddareddy: ‘జగన్‌కు సారీ చెప్తే.. జేసీ కుమారుడిని ఎమ్మెల్యేని చేస్తా’

ముఖ్యమంత్రి జగన్‌ వద్దకు వచ్చి తప్పు చేశానని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఒప్పుకుంటే ఆయన కుమారుడిని ఎమ్మెల్యేగా చేస్తానని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి అన్నారు.

Updated : 12 Jul 2023 09:04 IST

తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్యాఖ్య

అనంతపురం (రాణినగర్‌), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌ వద్దకు వచ్చి తప్పు చేశానని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఒప్పుకుంటే ఆయన కుమారుడిని ఎమ్మెల్యేగా చేస్తానని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి అన్నారు. మంగళవారం అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్లు రాజకీయాలు చేసిన జేసీ సోదరులు దిగజారిపోతున్నారని, ప్రతిసారీ అరుస్తూ అందరినీ భయపెట్టే వాతావరణాన్ని సృష్టిస్తున్నారన్నారు. ఆయన అధ్యాయం ముగిసి పోయిందని, రాబోవు ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. తాను అందరి తరహా రాజకీయ నేతను కాదన్నారు. నా ఉనికి పోతుంది అంటే ఎంత దూరమైనా వెళ్తా, నీతో యుద్ధం చేస్తా.. అని వ్యాఖ్యానించారు. అప్పట్లో తన సోదరుడి హత్యలో జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి కుట్రదారులని అప్పుడు నేను జైల్లో ఉన్నందున కేసు వీగిపోయేలా చేశారని ఆరోపించారు. 2024 ఎన్నికల తర్వాత జేసీ సోదరుల పరిస్థితి ఘోరంగా ఉంటుందన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని