logo

తాగునీరు కలుషితం.. 25 మందికి అస్వస్థత

గుంతకల్లు మండలంలోని నెలగొండ గ్రామానికి చెందిన  25 మంది వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురై ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చేరారు.

Published : 07 May 2024 05:08 IST

గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నెలగొండ గ్రామస్థులు

గుంతకల్లు గ్రామీణం, న్యూస్‌టుడే: గుంతకల్లు మండలంలోని నెలగొండ గ్రామానికి చెందిన  25 మంది వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురై ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చేరారు. గ్రామంలో కలుషిత నీరు తాగడం వల్లే ఇలా జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ట్యాంకును రెండు వారాలకోసారి శుభ్రం చేయాల్సి ఉండగా సచివాలయ ఉద్యోగులు ఎవరూ పట్టించుకోలేదన్నారు.రెండు రోజులుగా సమస్య ఉన్నా అధికారులు కన్నెత్తి చూడలేదని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. బాధితులను పరీక్షించిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కలుషిత నీటిని తాగడంతోనే వాంతుల, విరేచనాలయ్యాయని ధ్రువీకరించారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు