logo

‘ఇచ్చట ఓట్లు అమ్మబడవు’

గుత్తిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో పర్యవేక్షకుడిగా పని చేస్తున్న ఇస్మాయిల్‌ ఓటర్లను చైతన్యం పరుస్తున్నారు. గుంతకల్లులోని భాగ్యనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు.

Updated : 08 May 2024 07:26 IST

ఓట్లు అమ్ముకోబోమని చెబుతున్న ఇస్మాయిల్‌

గుంతకల్లు, తాడిపత్రి, న్యూస్‌టుడే : గుత్తిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో పర్యవేక్షకుడిగా పని చేస్తున్న ఇస్మాయిల్‌ ఓటర్లను చైతన్యం పరుస్తున్నారు. గుంతకల్లులోని భాగ్యనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఓటరు చైతన్య కార్యక్రమాల్లో భాగంగా ‘ఇచ్చట ఓట్లు అమ్మబడవు’ అని తన ఇంటి గోడకు స్టిక్కర్‌ అతికించాడు. ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు రాజకీయ నాయకులు ఇచ్చే తాయిలాలు అన్నీ ఇన్నీ కావని, ఒక్కసారి నోటుకు ఓటు వేస్తే ఐదేళ్లు నష్టపోవాల్సి వస్తుందని చట్టుపక్కల వాళ్లకు అవగాహన కల్పిస్తున్నారు. తాడిపత్రిలోనూ బ్యాంకు విశ్రాంత ఉద్యోగి షాషావలి సైతం అదేమాదిరి  ఇంటికి పోస్టర్‌ అతికించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు