logo

‘ఎప్పుడు ఎన్నికలొచ్చినా వైకాపా ఓటమి ఖాయం’

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా వైకాపాను చిత్తుగా ఓడించి ఇంటికి పంపటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. జిల్లా తెదేపా కార్యాలయంలో ఆదివారం రాత్రి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన

Updated : 23 May 2022 05:23 IST

మాట్లాడుతున్న మాజీ మంత్రి పుల్లారావు

బాపట్ల, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా వైకాపాను చిత్తుగా ఓడించి ఇంటికి పంపటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. జిల్లా తెదేపా కార్యాలయంలో ఆదివారం రాత్రి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత నియోజకవర్గ క్లస్టర్‌ ఇన్‌ఛార్జిల సమావేశంలో మాట్లాడుతూ ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి ఇంటికి నాయకులు, కార్యకర్తలు చేరవేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. నియోజకవర్గంలో పది మందిని క్లస్టర్‌ ఇన్‌ఛార్జులుగా నియమిస్తున్నట్లు తెలిపారు. వైకాపా ప్రభుత్వ మూడేళ్ల పాలనలో సాగు, మురుగునీటి కాలువల్లో కనీస మరమ్మతులు చేయలేదన్నారు. అధ్వానంగా ఉన్న కాలువల ద్వారా పంట భూములకు సాగునీరు ఎలా అందిస్తారని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విద్యుత్తు ఛార్జీలు విపరీతంగా పెంచి ప్రజలపై భారం వేశారన్నారు. పెట్రోలు, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం పన్నులు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. అప్పుడే నిత్యావసరాల ధరలు తగ్గి ప్రజలకు ఉపశమనం లభిస్తుందన్నారు. తెదేపా నియోజకవర్గ బాధ్యుడు వేగేశన నరేంద్రవర్మరాజు మాట్లాడుతూ పట్టణాల్లో చెత్త పన్ను వేయటం దారుణమన్నారు. ఏటా ఆస్తి పన్ను 15 శాతం పెంచుతూ మళ్లీ చెత్త పన్ను ఏమిటని ప్రశ్నించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా యువతకు ఉపాధి లేకుండా చేశారన్నారు. తెదేపా బీసీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, తెలుగు మహిళ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మానం విజేత పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని