logo

Chittoor News: కత్తితో బెదిరించి.. ఐస్‌క్రీం ఎత్తుకెళ్లి

ఓ దుకాణ యజమానిని కొందరు యువకులు కత్తితో బెదిరించి ఐస్‌క్రీం బాక్సులు ఎత్తుకెళ్లారు.

Updated : 24 May 2024 09:13 IST

దుకాణంలో సీసీ కెమెరాలో నమోదైన యువకులు

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: ఓ దుకాణ యజమానిని కొందరు యువకులు కత్తితో బెదిరించి ఐస్‌క్రీం బాక్సులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన పట్టణంలోని హెచ్‌పీ రోడ్డులో ఐస్‌క్రీం దుకాణంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. దుకాణ యజమాని మణికంఠను సదరు యువకులు బెదిరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. అవి గురువారం స్థానిక సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు