logo

హత్యచేసి రైలు పట్టాలపై పడేశారు

మతాంతర వివాహం నేపథ్యంలో బాలిక బంధువులే తమ కుమారుడ్ని చంపేసి రైలు పట్టాలపై పడేశారని బాధిత తల్లిదండ్రులు మునస్వామి, పార్వతి ఆరోపించారు.

Published : 23 May 2024 01:44 IST

పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బంధువుల ధర్నా

ధర్నా చేస్తున్న మృతుని బంధువులు

పాకాల, న్యూస్‌టుడే: మతాంతర వివాహం నేపథ్యంలో బాలిక బంధువులే తమ కుమారుడ్ని చంపేసి రైలు పట్టాలపై పడేశారని బాధిత తల్లిదండ్రులు మునస్వామి, పార్వతి ఆరోపించారు. బుధవారం వారు, బంధువులతో కలిసి పాకాల పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. మండలంలోని ఇరంగారిపల్లి పంచాయతీ తలారిపల్లికి చింతకాయల మురళి(29)ని ఫకీరుపేటకు చెందిన పీలేరు కర్ణ, రఫీ, బంధువులు హత్యచేసి రైల్వే ట్రాక్‌పై పడేశారని  సీఐ రాజగోపాల్‌కు ఫిర్యాదు చేశారు. ఫకీరుపేటకు చెందిన బాలికను మురళి మతాంతర వివాహం చేసుకున్నాడన్నారు. దీనిపై బాలిక తండ్రి చాన్‌బాషా ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని పిలిపించి బాలికను తల్లిదండ్రులకు అప్పగించారని వివరించారు. ఆ సమయంలో సెల్‌ఫోన్‌ను బాలిక బంధువులు తీసుకున్నారని, ఇదేమని అడిగితే ఫోన్‌ చూశాక తిరిగి ఇస్తామని చెప్పారని, దాని కోసం వెళ్లి శావమై వచ్చారని ఆరోపించారు. దీనిపై విచారించి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని