logo

నేటి నుంచి ఏనుగుల గణన

జిల్లాలోని అటవీ ప్రాంతంలో గురువారం నుంచి ఏనుగుల గణన చేపట్టనున్నారు.

Published : 23 May 2024 01:54 IST

చిత్తూరు (జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: జిల్లాలోని అటవీ ప్రాంతంలో గురువారం నుంచి ఏనుగుల గణన చేపట్టనున్నారు. చిత్తూరు తూర్పు, పశ్చిమ, కార్వేటినగరం, పలమనేరు, పుంగనూరు, కుప్పం రేంజ్‌ల పరిధిలోని బీట్‌లలో అధికారులు, సిబ్బంది ఇందులో పాల్గొననున్నారు. మొత్తం మూడురోజుల కొనసాగనుంది. మొదటిరోజు 15 కి.మీ. అడవిలో ఏనుగుల అడుగుజాడలు, మలమూత్ర విసర్జన ఆధారంగా వాటి సంఖ్య లెక్కిస్తారు. రెండోరోజు  మరో రెండు కి.మీ. మేర గణిస్తారు. మూడోరోజు నీటి కుంటలు, చెరువుల వద్ద వాటిని గమనించి లెక్కిస్తారు. ఆడ, మగ, చిన్న, పెద్ద లెక్కన వీటిని గణించి కేంద్ర అటవీశాఖకు నివేదించనున్నారు. ఆయా ఏర్పాట్లను డీఎఫ్‌వో చైతన్య కుమార్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని