logo
Updated : 29/11/2021 06:36 IST

‘ప్రభుత్వ వైఫల్యమే నష్టానికి కారణం’ 


దెబ్బతిన్న పంటను చూస్తున్న మాజీ మంత్రి అమరనాథరెడ్డి

పలమనేరు: ప్రభుత్వ వైఫల్యమే వరద నష్టానికి కారణమని మాజీ మంత్రి అమరనాథరెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన గంగవరం మండలం గండ్రాజుపల్లె గ్రామాన్ని సందర్శించి వరద నీటి కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. శంకర్రాయలపేట చెరువు ఔట్‌ఫ్లో సక్రమంగా లేనందున వరద నీరు గ్రామంలోని ఎస్సీకాలనీలోకి వచ్చేసిందన్నారు. చెరువులోకి వచ్చిన వరద నీటిని వెంటనే వెలుపలికి పంపే ఏర్పాట్లు చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. కాలనీకి చెందిన శంకర అనే వ్యక్తి వర్షం వచ్చిన రోజు రాత్రి మృతిచెందాడని, అయితే అతను అనారోగ్యంతో మృతిచెందినట్లు అధికారులు చెబుతున్నారని అన్నారు. ప్రభుత్వం పరిహారం ఇవ్వాలన్నారు. గ్రామంలోని వరద బాధిత కుటుంబాలకి ఆయన నిత్యావసరాలు పంపిణీ చేశారు.

Read latest Chittoor News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని