logo

పనులు చేయకుంటే మీ ఇళ్ల వద్ద దీక్ష చేస్తా

నియోజకవర్గ పరిధిలో గత ప్రభుత్వం చేపట్టిన రోడ్ల పనులు పూర్తిచేయకుంటే మీ ఇళ్ల వద్ద ధర్నా చేస్తామని ఎమ్మెల్యే వెంకటేగౌడ.. మాజీ మంత్రి అమరనాథరెడ్డిని హెచ్చరించారు. శనివారం తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2018-19లో పలు రోడ్డు పనులకు సంబంధించి ప్రభుత్వంతో

Published : 17 Jan 2022 03:13 IST

ఎమ్మెల్యే వెంకటేగౌడ


మాట్లాడుతున్న ఎమ్మెల్యే వెంకటేగౌడ

పలమనేరు: నియోజకవర్గ పరిధిలో గత ప్రభుత్వం చేపట్టిన రోడ్ల పనులు పూర్తిచేయకుంటే మీ ఇళ్ల వద్ద ధర్నా చేస్తామని ఎమ్మెల్యే వెంకటేగౌడ.. మాజీ మంత్రి అమరనాథరెడ్డిని హెచ్చరించారు. శనివారం తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2018-19లో పలు రోడ్డు పనులకు సంబంధించి ప్రభుత్వంతో అగ్రిమెంట్లు జరిగాయన్నారు. మాజీ మంత్రి అమరనాథరెడ్డి అప్పట్లో అన్ని పనులను ఒకేసారి ప్రారంభించి వదిలేశారన్నారు. బైరెడ్డిపల్లె, గంగవరం, పెద్దపంజాణి, వి.కోట, రామకుప్పం మండలాల్లో మొత్తం 87 రోడ్లకు రూ.123 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయన్నారు. శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ ఈ పనులు చేపట్టిందని, అప్పట్లో ఎన్నికలు రావడంతో పనులు చేయకుండా వదిలేశారన్నారు. కంపెనీ అమరనాథరెడ్డికి బినామీగా వ్యవహరిస్తోందని.. ఆయా పనులు పూర్తి చేయకుంటే అన్ని గ్రామాల ప్రజలను తీసుకొచ్చి అమరనాథరెడ్డి ఇంటి వద్ద, శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఎదుట నిరాహారదీక్ష చేస్తానని ఎమ్మెల్యే హెచ్చరించారు. సోమవారం అన్ని మండల కేంద్రాల్లో అసంపూర్తి రోడ్ల పనులకు సంబంధించి అధికారులకు వినతిపత్రాలు ఇవ్వాలని మండల స్థాయి ప్రజాప్రతినిధులను ఆయన కోరారు. వైకాపా నాయకులు మండి సుధాకర్‌, మురళీకృష్ణ, బాలాజీనాయుడు, విశ్వనాథరెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని