logo

పర్యాటక కేంద్రంగా అరణియార్‌

పిచ్చాటూరులోని అరణియార్‌ ప్రాజెక్టు 1.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ప్రాజెక్టు తిరుపతి-చెన్నై రహదారికి ఆనుకుని ఉంది. దీని కుడి వైపున 5 ఎకరాలు, ఎడమవైపున 8 ఎకరాల భూములు ఉన్నాయి. ఇక్కడ హోటళ్లు, రిక్రియేషన్‌ కేంద్రాలు, పిల్లలు ఆడుకునేందుకు పార్కు, ఈత కొలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని

Published : 24 Jan 2022 05:01 IST

ప్రతిపాదనలు పంపిన అధికారులు

ఈనాడు-తిరుపతి : పిచ్చాటూరులోని అరణియార్‌ ప్రాజెక్టు 1.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ప్రాజెక్టు తిరుపతి-చెన్నై రహదారికి ఆనుకుని ఉంది. దీని కుడి వైపున 5 ఎకరాలు, ఎడమవైపున 8 ఎకరాల భూములు ఉన్నాయి. ఇక్కడ హోటళ్లు, రిక్రియేషన్‌ కేంద్రాలు, పిల్లలు ఆడుకునేందుకు పార్కు, ఈత కొలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని ప్రాథమిక అంచనా వేశారు. ఇక్కడున్న అనుకూలతను దృష్టిలో ఉంచుకుని అరణియార్‌ ప్రాజెక్టును పర్యాటక అభివృద్ధి కేంద్రంగా మార్చేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. ఇందుకు సుమారు రూ.5.40 కోట్లు ఖర్చవుతుందని జలవనరులశాఖ అధికారులు అంచనాలు రూపొందించారు. అనుమతులు లభిస్తే ఏడాదిన్నరలోగా పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. పర్యాటకంగా అభివృద్ధి చేయడం వల్ల స్థానిక యువతకు ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా మరో 500 మందికి ఉపాధి లభిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టును చూసేందుకు పర్యాటకులు వస్తున్నారని, ఇది పూర్తయితే వీరి సంఖ్య మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని అధికారులు తెలిపారు. జిల్లాతోపాటు తమిళనాడు నుంచి పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది.

ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యాటకం అభివృద్ధికి చర్యలు చేపట్టిన అధికారులు.. తాజాగా పిచ్చాటూరు మండలంలోని అరణియార్‌ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖకు నివేదిక పంపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని