logo

నేడు రాములోరి కల్యాణం

పట్టణంలోని బాలాంజనేయస్వామి ఆలయంలో శ్రీరామనవమి వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గురువారం శ్రీరామనవమి సందర్భంగా ఆలయ ఆవరణలో సీతారాముల కల్యా ణం నిర్వహించనున్నారు.

Updated : 30 Mar 2023 03:28 IST

రాధాకృష్ణ అలంకారంలో స్వాముల వారు

సూళ్లూరుపేట: పట్టణంలోని బాలాంజనేయస్వామి ఆలయంలో శ్రీరామనవమి వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గురువారం శ్రీరామనవమి సందర్భంగా ఆలయ ఆవరణలో సీతారాముల కల్యా ణం నిర్వహించనున్నారు. నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం సాయంత్రం స్వామివారు రాధాకృష్ణ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి తితిదే ధర్మప్రచార పరిషత్‌ వారిచే హరికథా కార్యక్రమం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు దీవి లక్ష్మీనారాయణ, ఆలయ ఛైర్మన్‌ అయితా శ్రీధర్‌ భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు.

తడ : తడకండ్రిగ పంచాయతీ బోడిలింగాలపాడులోని సీతారామలక్ష్మణ ప్రసన్న వీరాంజనేయస్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చారణ మధ్య సీతారామస్వామిని పూలతో అలంకరించారు. వెంకటగిరి : పట్టణంలోని పలు ఆలయాలు వేడుకలకు ముస్తాబయ్యాయి. పాతబస్టాండ్‌లోని రామ మందిరంలో వేడుకలు నిర్వహణకు ఆలయ కమిటీ సభ్యులు చర్యలు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని