logo

ముగిసిన పరిశీలన.. మిగిలింది ఉపసంహరణ

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది.

Published : 27 Apr 2024 02:24 IST

29 వరకు గడువు

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించి 21 మంది అభ్యర్థుల నామపత్రాలు ఆమోదించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ షన్మోహన్‌ తెలిపారు. చిత్తూరు ఎంపీ స్థానానికి 35 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయగా 14 మంది నామపత్రాలు తిరస్కరించారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 137 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 53 తిరస్కరణకు గురికాగా, 84 ఆమోదించారు. అభ్యర్థిత్వాల  ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని