logo

నిన్న అనుమతించలేదు.. నేడు తిరస్కరించారు..

నామినేషన్ల చివరి రోజు గురువారం చిత్తూరు ఎంపీ అభ్యర్థినిగా పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా పార్టీకి చెందిన భూలక్ష్మి నామినేషన్‌ దాఖలు చేశారు.

Published : 27 Apr 2024 02:33 IST

తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేశారని వెనక్కివస్తున్న పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా ఎంపీ అభ్యర్థిని భూలక్ష్మి

నామినేషన్ల చివరి రోజు గురువారం చిత్తూరు ఎంపీ అభ్యర్థినిగా పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా పార్టీకి చెందిన భూలక్ష్మి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆమె పత్రాలు పరిశీలించిన ఎన్నికల అధికారులు ప్రతిపాదకుల్లో ఒకరిది ఓటరు లిస్టులో తమ పేరు పక్కన ఉన్న సీరియల్‌ నంబరు తప్పుగా ఉందని అభ్యర్థినికి తెలిపారు. మిగతావన్నీ సరిగా ఉన్నాయని చెప్పటంతో ఆమె వెంటనే ఆన్‌లైన్‌లో ఓటరు లిస్టు పరిశీలించి సరిచేసిన సీరియల్‌ నంబరు పత్రాన్ని సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్లారు. ఎన్నికల అధికారులు పత్రాన్ని తీసుకురమ్మన్నారని.. పోలీసులకు విన్నవించినా అనుమతించకపోగా శుక్రవారం రావాలని సలహా ఇచ్చారు. దీంతో చేసేదిలేక ఆమె వెనుదిరిగారు. శుక్రవారం నామపత్రాల పరిశీలన సందర్భంగా ఎన్నికల అధికారులకు ఆమె ఓటరు లిస్టులోని సరిచేసిన పత్రాన్ని ఇవ్వబోగా ఇది గురువారమే ఇవ్వాలని ఇప్పుడు తీసుకోబోమని చెప్పి ఆమె అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు. దీంతో ఆమె ఆవేదనతో వెనుదిరిగారు.

ఈనాడు, చిత్తూరు, న్యూస్‌టుడే, చిత్తూరు కలెక్టరేట్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు