logo

ఎస్‌బీ కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోండి

స్పెషల్‌ బ్రాంచ్‌ (ఎస్‌బీ)లో పనిచేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ రామకృష్ణ, కానిస్టేబుల్‌ దాము.. చిత్తూరు వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డికి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్‌

Published : 27 Apr 2024 02:25 IST

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి చిత్తూరు తెదేపా అభ్యర్థి ఫిర్యాదు

ఈనాడు, చిత్తూరు: స్పెషల్‌ బ్రాంచ్‌ (ఎస్‌బీ)లో పనిచేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ రామకృష్ణ, కానిస్టేబుల్‌ దాము.. చిత్తూరు వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డికి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్‌ శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముఖేష్‌కుమార్‌ మీనాకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఆర్‌పురం మండలం కొత్తపల్లిమిట్టకు చెందిన వీరిద్దరూ ఐదేళ్లుగా ఎస్‌బీలో పనిచేస్తున్నారని అందులో పేర్కొన్నారు. హెడ్‌ కానిస్టేబుల్‌ కన్నా పైస్థాయి అధికారులనే స్పెషల్‌ బ్రాంచ్‌లో నియమించాల్సి ఉండగా.. నిబంధనలకు విరుద్ధంగా కానిస్టేబుళ్లను నియమించారన్నారు. రామకృష్ణ, దాము తన ఫోన్‌తోపాటు పార్టీ శ్రేణుల ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారని గురజాల అందులో వివరించారు. ఇళ్లలో తనిఖీలు చేసి భయపెడుతున్నారని తెలిపారు. తన కదలికలను విజయానందరెడ్డికి తెలియజేస్తున్నందున వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఈవోను కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని