కర్మచారీలకు మూడు నెలలకోసారి వైద్య పరీక్షలు
సఫాయి కర్మచారీలకు ప్రతి మూడు నెలలకోసారి వైద్య పరీక్షల్ని నిర్వహించాలని సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ ఛైర్మన్ వెంకటేషన్ అన్నారు
మాట్లాడుతున్న సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ ఛైర్మన్ వెంకటేషన్
చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: సఫాయి కర్మచారీలకు ప్రతి మూడు నెలలకోసారి వైద్య పరీక్షల్ని నిర్వహించాలని సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ ఛైర్మన్ వెంకటేషన్ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ షన్మోహన్, ఎస్పీ రిశాంత్‌రెడ్డితో కలిసి నగర, పురపాలక కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్మచారీల సమస్యల పరిష్కారానికి జాతీయ సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వ శాఖ పనిచేస్తుందన్నారు. కర్మచారీలకు వేతనాలు, బీమా ఇతర సౌకర్యాల్ని వర్తింపజేయాలన్నారు. వారు తమ సమస్యలపై ఎన్‌సీఎస్‌కే పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. వేతనాలు సరిగ్గా రావడం లేదంటూ గుడిపాల మండలం కుప్పిగానిపల్లెకు చెందిన కార్మికులు ఫిర్యాదు చేశారు. తమ వేతనాలపై బ్యాంకు రుణాల్ని మంజూరు చేయించాలని చిత్తూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది విన్నవించారు. ఎక్కడైనా సమస్యలుంటే కర్మచారీలు తనను చరవాణి (62815 47701) లో సంప్రదించవచ్చని సూచించారు. జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి డాక్టర్ రాజయలక్ష్మి, చిత్తూరు కమిషనర్ అరుణ, చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసమూర్తి, వివిధ పురపాలక సంఘాల కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన ఛైర్మన్‌గా బక్కి వెంకటయ్య
-
Sai Rajesh: నా సాయం పొందిన వ్యక్తే నన్ను తిట్టాడు: ‘బేబీ’ దర్శకుడు
-
TTD: సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడు.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
Weather Report: తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి వర్షాలు
-
Military Tank: సైనిక శిక్షణ కేంద్రంలో మాయమై.. తుక్కులో తేలి!
-
Chandrayaan 3: జాబిల్లిపై సూర్యోదయం.. విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు ఇస్రో ప్రయత్నాలు