logo

ఒడిశా రైలు ప్రమాదంపై ఆరా

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై అధికారులు అప్రమత్తమయ్యారు.  యశ్వంత్‌పూర్‌- హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌ రైలు కాట్పాడి, తిరుపతిలో స్టాపింగ్‌ ఉండడం.. చిత్తూరు మీదుగా వెళుతుండటంతో జిల్లా వాసులెవరైనా ఉన్నారేమోనని పరిశీలిస్తున్నారు.

Published : 04 Jun 2023 03:08 IST

చిత్తూరు రైల్వే స్టేషన్‌లోని అధికారులతో మాట్లాడుతున్న చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసమూర్తి

చిత్తూరు(నేరవార్తలు), న్యూస్‌టుడే: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై అధికారులు అప్రమత్తమయ్యారు.  యశ్వంత్‌పూర్‌- హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌ రైలు కాట్పాడి, తిరుపతిలో స్టాపింగ్‌ ఉండడం.. చిత్తూరు మీదుగా వెళుతుండటంతో జిల్లా వాసులెవరైనా ఉన్నారేమోనని పరిశీలిస్తున్నారు. రైల్వే అధికారులతో పాటు పోలీసులు ఉదయం నుంచి వివిధ మార్గాల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. చిత్తూరు ప్రత్యేక బ్రాంచి డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తమ సమాచార వ్యవస్థ ద్వారా వాకబు చేస్తున్నారు. చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసమూర్తి రైల్వే అధికారులను ఆశ్రయించి హెల్ప్‌లైన్‌, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. తత్కాల్‌లోనైనా టికెట్‌ బుకింగ్‌ ఉందేమోనని ఆరా తీయగా అందులోనూ జిల్లాకు చెందిన వారు లేనట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ ద్వారానే టికెట్‌లు బుక్‌ అయినట్లు అధికారులు గుర్తించారు. అధికారుల పరిశీలనలో శనివారం వరకు రైలు ప్రమాదానికి గురైనవారిలో జిల్లాకు చెందిన వారెవరూ లేనట్లు అధికారులు తేల్చారు.

కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు

చిత్తూరు కలెక్టరేట్‌: రైలు ప్రమాదానికి సంబంధించి జిల్లాకు చెందిన ప్రయాణికుల సమాచారం నిమిత్తం కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేశామని కలెక్టర్‌ షన్మోహన్‌ తెలిపారు. జిల్లాకు చెందిన ప్రయాణికులు ఎవరైనా ఉన్నట్లైతే 94910 77356, 08572-242777 నంబర్లకు సమాచారాన్ని అందించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని