logo

సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!

పోలీసు శాఖలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్‌ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు.

Published : 26 Apr 2024 04:35 IST

355 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల తిరస్కరణకు ఏఎస్పీ యత్నం? 

ఈనాడు, చిత్తూరు: పోలీసు శాఖలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్‌ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు.. ఆ తర్వాత వచ్చిన ఫాం- 12ను పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 1,800 మందికి పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే అవకాశం ఉంది. ఏప్రిల్‌ 23 వరకు 1,435 ఫాం-12లు వచ్చాయి. వీటని కలెక్టరేట్‌కు పంపారు. పోలీసు శాఖలో సిబ్బంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని దాదాపు 355 పోస్టల్‌ బ్యాలెట్లను తిరస్కరించేందుకు యత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. శుక్రవారం వరకు సమయం ఉన్నందున మిగతా వాటినీ పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈ అంశంపై ఏఎస్పీ ఆరిఫులా ‘ఈనాడు’తో మాట్లాడుతూ తొలుత ఏప్రిల్‌ 23 వరకు గడువు ఇచ్చారని.. ఆ తర్వాత పొడిగించినందున మిగతావారి ఫాం-12 తీసుకుంటామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని