logo

పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానికి నేడు ఆఖరు

ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, అత్యవసర సేవల్లోని ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకునేందుకు బుధవారం ఆఖరు గడువు.

Published : 08 May 2024 05:35 IST

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, అత్యవసర సేవల్లోని ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకునేందుకు బుధవారం ఆఖరు గడువు. ఇతర జిల్లాలో ఓటు కల్గి, చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో ఇప్పటివరకూ 4,034 మంది ఉద్యోగులకుగానూ 2,941 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్నారు.

  • మంగళవారం పుంగనూరు నియోజకవర్గంలో 231, నగరి 100, జీడీనెల్లూరు 116, చిత్తూరు 188, పూతలపట్టు 214, పలమనేరు 393, కుప్పంలో 156 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఈ మూడు రోజుల్లో 10,827 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ సద్వినియోగం చేసుకున్నారు.
  • అత్యవసర సర్వీసుల్లోని ఉద్యోగులు మొత్తం 4,061 మందికిగానూ  ఇప్పటివరకూ 2,735 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించారు. పుంగనూరులో 396 మంది, నగరిలో 101, జీడీనెల్లూరు 327, చిత్తూరు 751, పూతలపట్టు 498, పలమనేరు 355, కుప్పంలో 307 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ సద్వినియోగం చేసుకున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని