logo

తిరు కల్యాణం.. తరించిన భక్తజనం!

ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి తిరుకల్యాణ మహోత్సవం బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ తూర్పు వైపున అనివేటి మండపంలో ఏర్పాటు చేసిన అందమైన వేదికపై పద్మావతి,

Published : 23 May 2024 04:44 IST

కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు, పండితులు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి తిరుకల్యాణ మహోత్సవం బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ తూర్పు వైపున అనివేటి మండపంలో ఏర్పాటు చేసిన అందమైన వేదికపై పద్మావతి, ఆండాళ్‌ అమ్మవార్లను వేంకటేశ్వరస్వామి పరిణయమాడిన ఘట్టాన్ని తిలకించి భక్తులు పరమానందం పొందారు. తొలుత పెండ్లికుమారుడు, పెండ్లికుమార్తెలుగా ముస్తాబైన స్వామి, అమ్మవార్లను ఆలయం నుంచి వేర్వేరు వాహనాలపై మండపం వద్దకు తోడ్కొని వచ్చారు. అనంతరం ఆలయ పండితులు ప్రత్యేక, వర పూజలు చేశారు. దేవస్థానం ఛైర్మన్‌ ఎస్వీ సుధాకరరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త నివృతరావు, ఈవో వేండ్ర త్రినాథరావు చేతులు మీదుగా పట్టు వస్త్రాలు సమర్పించారు. వాటిని స్వామి, అమ్మవార్లకు అలంకరించి మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ కల్యాణ క్రతువు నిర్వహించారు. మహూర్త సమయంలో జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని శిరస్సుపై ఉంచారు. మాంగల్యధారణ కార్యక్రమాన్ని వైఖానస ఆగమానుసారం జరిపించారు. వేద విద్యార్థులు, ప్రముఖులు, భక్తులు స్వామివారి కల్యాణాన్ని తిలకించి తరించారు. 

సింహ వాహనంపై గ్రామోత్సవం.. తిరుకల్యాణోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్వామి, అమ్మవార్లను సింహవాహనంపై  ప్రత్యేకంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. స్వామి వారు మోహిని రూపంలో  భక్తులకు దర్శనమిచ్చారు.

  • కల్యాణమహోత్సవాల్లో ఈరోజు రాత్రి 7గంటలకు రథోత్సవం  
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని