logo

కృష్ణబాబుకు కన్నీటి వీడ్కోలు

మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) అంత్యక్రియలు బుధవారం నిర్వహించారు. కొవ్వూరు మండలం దొమ్మేరులోని దివాణం వద్ద పార్టీలకు అతీతంగా నాయకులు, పారిశ్రామికవేత్తలు పెద్దఎత్తున వచ్చి కృష్ణబాబు భౌతికకాయానికి నివాళి అర్పించారు.

Published : 23 May 2024 04:56 IST

సంతాపం వ్యక్తంచేస్తున్న హోం మంత్రి తానేటి వనిత, చిత్రంలో మాజీ మంత్రి రామనారాయణరెడ్డి తదితరులు

కొవ్వూరు పట్టణం: మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) అంత్యక్రియలు బుధవారం నిర్వహించారు. కొవ్వూరు మండలం దొమ్మేరులోని దివాణం వద్ద పార్టీలకు అతీతంగా నాయకులు, పారిశ్రామికవేత్తలు పెద్దఎత్తున వచ్చి కృష్ణబాబు భౌతికకాయానికి నివాళి అర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంలో కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో కృష్ణబాబు భౌతిక కాయాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి శాస్త్రోక్తంగా క్రతువును పూర్తి చేశారు. ఏర్పాట్లను పెండ్యాల నరేంద్రనాథ్‌చౌదరి, అచ్చిబాబు, అల్లుడు రాజీవ్‌కృష్ణ పర్యవేక్షించారు. ఉమ్మడి పశ్చిమ రాజకీయాలను శాసించిన పెండ్యాల కృష్ణబాబు తనకు రాజకీయ గురువని, ఆయన మృతి తీరనిలోటని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, వడ్డే శోభనాద్రీశ్వరరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, జి.శ్రీనివాసనాయుడు, జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్సీలు నన్నపునేని రాజకుమారి, కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యేలు టీవీ రామారావు, ఆరిమిల్లి రాధాకృష్ణ, జొన్నకూటి బాబాజీరావు, గంటా మురళి, జడ్పీ మాజీ ఛైర్మన్లు ఇమ్మణ్ణి రాజేశ్వరి, ముళ్లపూడి బాపిరాజు, దేవీ సీఫుడ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పొట్రు బ్రహ్మానందం, నవభారత్‌ ఇండస్ట్రీస్‌ ఎండీ బోళ్ల రాజీవ్, ఆంధ్రా షుగర్స్‌ జోనల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జె.మురళి, ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాసరావు, శశి సంస్థల అధినేత బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ తదితరులు నివాళి అర్పించారు.

కృష్ణబాబు భౌతిక కాయం ఊరేగింపు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని