logo
Published : 02/12/2021 06:33 IST

రైతులకు వ్యతిరేకంగా భారీ సా్కమ్‌: మనోహర్‌


విలేకరులతో మాట్లాడుతున్న నాదెండ్ల

మండపేట, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి లేదని, జిల్లాలో రైతులకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కనుసన్నల్లో పెద్ద స్కామ్‌ జరుగుతోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. ఇందులో జిల్లా పెద్దల ప్రమేయం ఉన్నట్లు తమ వద్ద ఆధారాలున్నాయని, త్వరలో బయటపెడతామని పేర్కొన్నారు. మండపేటలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తీసుకున్న నిర్ణయం మేరకు తాము ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణానికి రూ. 13,708 కోట్లు కేటాయించి, ఇతర సంస్థల నుంచి రుణాలు తెచ్చినా గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క గుంతైనా పూడ్చలేకపోయారని విమర్శించారు. మరమ్మతులకు రూ.2,000 కోట్లు మంజూరు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించినా ఇంత వరకు అమలుకు నోచుకోలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి.. స్పందించే గుణం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు 151 సీట్లలో వైకాపాను గెలిపించినా.. జగన్‌కు పరిపాలించే దక్షత లేదని అన్నారు. పంట నష్టం అంచనా వేయడానికి కనీసం అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించడం లేదని, పంట నష్టంపై అంచనాలు తయారు చేయక ముందే 30 శాతం పరిహారం ఇస్తామని అంటున్నారన్నారు. గత ఏడాది బకాయిలే ఇంత వరకు చాలా మంది రైతుల ఖాతాలో పడలేదని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో రహదారుల మరమ్మతులు, రైతుల పరిస్థితి, 30 ఏళ్ల కిందట కట్టిన గృహాలకు ఓటీఎస్‌ కట్టాలని బలవంతం చేస్తున్న అంశాలపై పార్టీ తరఫున ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం మండపేట పరిసరాల్లోని రైతులను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు నియోజకవర్గ ఇన్‌ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణ, జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌, పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్‌, శెట్టిబత్తుల రాజబాబు, కాకినాడ మాజీ మేయరు కవికొండల సరోజ, మాకినీడి శేషకుమారి, మర్రెడ్డి శ్రీనివాస్‌, ఉండమట్ల రామారావు తదితరులు పాల్గొన్నారు.

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని