logo

ఆక్వా వ్యర్థం.. అల్లాడుతోంది తీరం

తీరంలో కాలుష్యం పెరిగి సముద్రం పెను మార్పులకు గురవుతోంది. ఓడలరేవు తీరంలో సీఆర్‌జడ్‌ పరిధిలో అనధికార రొయ్యల చెరువుల నుంచి వ్యర్థ జలాలను సముద్రంలోకి యథేచ్ఛగా వదిలేస్తున్నారు. ప్రస్తుతం సముద్రంలో మత్స్యసంపద గుడ్లు పెట్టే

Published : 20 Apr 2022 06:14 IST

తీరంలో కాలుష్యం పెరిగి సముద్రం పెను మార్పులకు గురవుతోంది. ఓడలరేవు తీరంలో సీఆర్‌జడ్‌ పరిధిలో అనధికార రొయ్యల చెరువుల నుంచి వ్యర్థ జలాలను సముద్రంలోకి యథేచ్ఛగా వదిలేస్తున్నారు. ప్రస్తుతం సముద్రంలో మత్స్యసంపద గుడ్లు పెట్టేకాలంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి వేట నిషేధం విధించింది. ఇలాంటి సమయంలో క్రిమి సంహారక మందులు, రసాయన అవశేషాలున్న వ్యర్థ జలాలు సముద్రంలోకి వదలడం వల్ల నీరంతా విషతుల్యమవుతోంది. ఈ ప్రభావం మత్స్యసంపద వృద్ధిపై పడుతోందని పర్యావరణ వేత్తలు వాపోతున్నారు. ఓడలరేవు వద్ద ప్రైవేటు రిసార్టుకు ఆనుకుని ఉన్న రొయ్యల చెరువులు సముద్రానికి కేవలం 20 మీటర్ల దూరంలోనే ఉంటాయి. వాటి నుంచి ఇంజిన్లతో తోడి వదిలేస్తున్నారు. అధికారులు నివారించాలని కోరుతున్నారు.- న్యూస్‌టుడే, అల్లవరం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని