logo

జయహో భారత్‌.. జయహో సాతి్వక్‌

సహ ఆటగాళ్లతో కలిసి థామస్‌ కప్‌లో విజయం సాధించి అమలాపురం చేరుకున్న బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌కు పట్టణవాసుల నుంచి గురువారం ఘనస్వాగతం లభించింది. క్రీడాభిమానులు

Published : 20 May 2022 05:45 IST

జాతీయ పతాకంతో యువత, చిన్నారుల సందడి

గడియార స్తంభం, న్యూస్‌టుడే: సహ ఆటగాళ్లతో కలిసి థామస్‌ కప్‌లో విజయం సాధించి అమలాపురం చేరుకున్న బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌కు పట్టణవాసుల నుంచి గురువారం ఘనస్వాగతం లభించింది. క్రీడాభిమానులు ఈదరపల్లి నుంచి బ్యాండు మేళం, బాణసంచా పేల్ఛి. జయహో భారత్‌, జయహో సాత్విక్‌ నినాదాలతో భారీ ఊరేగింపుగా గడియారస్తంభం కూడలికి తీసుకువచ్చారు. అక్కడి వేదికపై సాత్విక్‌తోపాటు ఆయన తల్లిదండ్రులు రంగమణి, కాశీవిశ్వనాథ్‌ను మంత్రి విశ్వరూప్‌, కలెక్టర్‌ హిమాన్షుశుక్లా శాలువాలతో సత్కరించారు. 73 ఏళ్ల తరువాత భారత జట్టు కప్‌ సాధించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. ఆర్డీవో వసంతరాయుడు, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ సత్యనాగేంద్రమణి, కోనసీమ జిల్లా షటిల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మెట్ల రమణబాబు, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ చిక్కాల గణేష్‌, చెల్లుబోయిన శ్రీను, కోనసీమ ఐకాస నాయకులు వీఎస్‌ దివాకర్‌, బండారు రామమోహనరావు, కల్వకొలను బాబు, కరాటం ప్రవీణ్‌, రంకిరెడ్డి శ్రీనివాసరావు, నల్లా శివ, తిక్కిరెడ్డి సురేష్‌, జయంతి సురేష్‌, అన్యం రాంబాబు పాల్గొన్నారు.

a

సాత్విక్‌, తల్లిదండ్రులను సత్కరిస్తున్న మంత్రి, కలెక్టర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని