logo

శిథిల భవనంలో భయం.. భయం..

బీటలు వారిన గోడలు.. పెచ్చులూడుతున్న పైకప్పు.. మొత్తంగా శిథిలావస్థకు చేరిన భవనం.. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని స్థితి..

Published : 27 Mar 2023 05:16 IST

విరిగిన మెట్లు..  పెచ్చులూడిన పైకప్పు చూపుతున్న విద్యార్థినులు

బీటలు వారిన గోడలు.. పెచ్చులూడుతున్న పైకప్పు.. మొత్తంగా శిథిలావస్థకు చేరిన భవనం.. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని స్థితి.. అందులోనే భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న విద్యార్థినులు.. కాకినాడ గ్రామీణం యానాం రోడ్డులోని బాలయోగి విగ్రహం సమీపంలోని బీసీ బాలికల కళాశాల వసతిగృహం దుస్థితి ఇది.. నగరంలోని ఆంధ్ర పాలిటెక్నిక్‌, ఎంఎస్‌ఎం డిగ్రీ, జూనియర్‌ కళాశాల, చొల్లంగి పైడా కళాశాలలో చదువుతున్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన 96 మంది విద్యార్థినులు ఇందులోనే తలదాచుకొంటున్నారు.. వసతిగృహం గేటు, మరుగుదొడ్ల తలుపులు పూర్తిగా పాడయ్యాయి. సొంత వసతి లేకపోవడంతో అద్దె భవనంలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ భవనానికి నెలకు దాదాపు రూ.25 వేల అద్దె చెల్లిస్తున్నారు.. భవనం దుస్థితిని హాస్టల్‌ సంక్షేమ అధికారిణి స్వరాజ్యలక్ష్మి దృష్టికి తీసుకెళ్లగా సమస్యను ఉన్నతాధికారులకు వివరించామని చెప్పారు. కాకినాడ డివిజన్‌ బీసీ సంక్షేమ సహాయ అధికారి టీవీప్రసాద్‌ను వివరణ కోరగా ఇప్పటికే కొన్ని భవనాలు పరిశీలించామని.. త్వరలోనే కొత్త భవనంలోకి వసతిగృహాన్ని తరలించేలా చూస్తామని తెలిపారు.

ఈనాడు, కాకినాడ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని