logo

కొనసాగిన నామినేషన్ల సందడి

ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో రెండో రోజే నామినేషన్ల దాఖలు సందడి కొనసాగింది.

Updated : 20 Apr 2024 05:44 IST

ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో రెండో రోజే నామినేషన్ల దాఖలు సందడి కొనసాగింది. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు కూడా నామపత్రం సమర్పించారు.  ప్రధాన పార్టీల నుంచి తూర్పుగోదావరి జిల్లాలో 12, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 10,  కాకినాడ జిల్లాలో 4 నామినేషన్‌ దాఖలు చేశారు.

 న్యూస్‌టుడే బృందం 


నియోజకవర్గం: కాకినాడ  నగరం

నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆర్‌వో వెంకట్రావుకు నామపత్రం అందజేస్తున్న  కొండబాబు

 అభ్యర్థి: వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)

పార్టీ: తెదేపా (కూటమి అభ్యర్థి)

  • 124075595 కాకినాడ సిటీ, బిక్కవోలు, పిఠాపురం, రాజమహేంద్రవరం తదితర స్టేషన్లలో కేసులు ఉన్నాయి
  • చరాస్తులు: కొండబాబు పేరిట రూ.6 లక్షల విలువైన బంగారం, ఆయన సతీమణి శ్రీదేవి పేరిట రూ.12లక్షలు విలువ చేసే బంగారం. కొండబాబు పేరిట ఉమా శంకర్‌ డ్రై ఫిష్‌ కంపెనీలో రూ.17లక్షలు విలువ చేసే 30 శాతం వాటా, ఆయన సతీమణి శ్రీదేవికి గౌరీ శంకర్‌ డ్రై ఫిష్‌ ట్రేడర్స్‌లో రూ.15లక్షలు విలువ చేసే 25 శాతం వాటా ఉంది. 
  • స్థిరాస్తులు: కొండబాబు పేరిట పటవల, జి.వేమరం ప్రాంతాల్లో సుమారు 32 ఎకరాల వ్యవసాయ భూములు, ఆయన సతీమణి పేరిట గొడారిగుంట, తూరంగి ప్రాంతాలలో సుమారు 13 ఎకరాలు ఉన్నాయి. కాకినాడ వార్పు రోడ్డులో తన పేరిట 8వేల చ.అ.గోదాము, 1500 చ.అ.స్థలంలో భవనం ఉన్నాయి. జగన్నాథపురంలో భార్య పేరిట సొంత నివాస గృహాలు ఉన్నట్లు వివరించారు. తన వద్ద రూ.90వేలు, భార్య వద్ద రూ.70వేలు నగదు,  తన పేరిట రూ.7 లక్షలు, భార్య పేరిట రూ.56వేలు డిపాజిట్లు (ఎఫ్‌డీఆర్‌) ఉన్నట్లు పేర్కొన్నారు.

    నియోజకవర్గం: రాజమహేంద్రవరం గ్రామీణం

ఆర్వో తేజ్‌భరత్‌కి నామినేషన్‌ పత్రాలు అందజేస్తున్న కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి

  •  అభ్యర్థి: గోరంట్ల బుచ్చయ్యచౌదరి
  •  పార్టీ: తెదేపా (కూటమి అభ్యర్థి)
  •  విద్యార్హతలు: బీఎస్సీ
  •  కేసులు:  ప్రధానంగా తొమ్మిది కేసులు ప్రస్తావించారు.
  •  చరాస్తులు : భార్యాభర్తలిద్దరివి కలిపి
  • రూ.1,52,16,239 నీ వార్షిక ఆదాయం : భార్యాభర్తలిద్దరి ఆదాయం రూ.4,99,443
  •  బంగారం: రూ.66,26,470 విలువ చేసే బంగారం ఉందని ప్రస్తావించారు.
  •  స్థిరాస్తి: భార్య పేరున రూ.38,90,000, ఆయన పేరున రూ.2,56,98,193 విలువ చేసే స్థిరాస్తి ఉందని ప్రస్తావించారు.
  •  అప్పులు: భార్యాభర్తలిద్దరికి కలిపి మొత్తం రూ.2,67,73,323 అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు.

    నియోజకవర్గం: కొవ్వూరు

నామపత్రం సమర్పిస్తున్న కూటమి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు

  •  అభ్యర్థి: ముప్పిడి వెంకటేశ్వరరావు
  •  పార్టీ: తెదేపా (కూటమి అభ్యర్థి)
  •  విద్యార్హత: ఎం.ఎస్‌.డబ్ల్యు, (మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్కర్‌), బీఎల్‌  
  •  క్రిమినల్‌ కేసులు: 10
  • ఆస్తులు: భార్య సుజాత పేరున దేవరపల్లిలో ఇల్లు. చింతలపూడిలో 85 సెంట్ల పొలం. గుంటూరు జిల్లా పెద్దపరిమిలో ఎమ్వీఆర్‌ పేరున 261 చ.గ. భార్య పేరున 446 చ.గ. స్థలాలు. ఒక ద్విచక్ర వాహనం, 52 గ్రాముల బంగారం, రూ.1.50 లక్షలు, భార్య పేరున టాటా ఇండికా కారు, 96 గ్రాముల బంగారం ఉన్నాయి. భార్యకు చెందిన బ్యాంకు ఖాతాల్లో రూ.3.90 లక్షలు.
  •  అభ్యర్థి ఆస్తుల విలువ : రూ.30.37 లక్షలు, నీ భార్య పేరున ఆస్తులు: సుమారు రూ.90 లక్షలు
  •  అభ్యర్థి అప్పులు: బ్యాంకులో రూ.10.31 లక్షలు, ఇద్దరు పిల్లలు పేరున రూ.40 లక్షలు అప్పులు ఉన్నాయి.

    నియోజకవర్గం: నిడదవోలు

నామినేషన్‌ దాఖలు చేస్తున్న దుర్గేష్‌, పక్కన శేషారావు, ప్రసాద్‌, బండి

  •  అభ్యర్థి: కందుల లక్ష్మీ దుర్గేష్‌ ప్రసాద్‌  నీ పార్టీ: జనసేన(కూటమి అభ్యర్థి)  నీ విద్యార్హత: ఎంఏ(ఎకానామిక్స్‌)
  •  క్రిమినల్‌ కేసులు: 10 నీ చరాస్తుల విలువ: హేండ్‌ క్యాష్‌ రూ.9,19,618, ఎన్‌ఎస్‌ఎస్‌, పోస్టల్‌ సేవింగ్స్‌, ఇన్సురెన్స్‌ పాలసీలు రూ.52,85,395, బంగారం 50 గ్రాములు (రూ.2 లక్షలు), వెండి 2.5 కేజీలు (రూ.2 లక్షలు), అతని భార్య బంగారం 100 గ్రాములు (రూ.4 లక్షలు), అతని భార్య వెండి 2.5 కేజీలు (రూ.2 లక్షలు)  
  •  స్థిరాస్తులు: జంగారెడ్డిగూడెం, రాచర్లలో 5.92 ఎకరాల వ్యవసాయ భూమి, భార్య పేరన ఒక ఎకరం. వాటి విలువ రూ.2.20 కోట్లు, నాన్‌ అగ్రికల్చరల్‌ ల్యాండ్‌ 2,101 ఎస్‌ఎఫ్‌టీ, కమర్షియల్‌ భవనాలు 4,778 ఎస్‌ఎఫ్‌టీ, రెసిడెన్షియల్‌ బిల్డింగ్‌లు 270 చదరపు అడుగులు, 4,500 ఎస్‌ఎఫ్‌టీ, రూ.1,93,82,439 నీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు: రూ.1,34,611

నియోజకవర్గం: రాజానగరం

ఆర్వో చైత్రవర్షిణికి నామపత్రం అందజేస్తున్న జక్కంపూడి రాజా

  •  అభ్యర్థి: జక్కంపూడి రాజా ఇంద్రవందిత్‌
  •  పార్టీ: వైకాపా నీ వయస్సు: 35
  •  విద్యార్హత: ఎంబీఏ  
  •  కేసులు: ఒక కేసు ప్రస్తావించారు
  •  చేతినగదు, సేవింగ్స్‌, డిపాజిట్లు: భార్యభర్తలిద్దరికి కలిపి రూ.9,52,653
  •  కార్లు: ఆయనకు రెండు, భార్య రాజశ్రీకి ఒకటి
  •  చరాస్తులు: రాజాకు రూ.1,34,34,024.55, భార్యకు రూ.93,59,042.59
  •  స్థిరాస్తులు: భార్యభర్తలిద్దరికి కలిపి రూ.1,29,68,800
  •  బంగారు ఆభరణాలు, వెండి: ఆయన పేరున 525 గ్రాములు విలువ రూ.33,29,550, భార్య పేరున రూ.76,10,400
  •  అప్పులు: ఆయన పేరుతో రూ.39,36,537,84, భార్యపేరున రూ.35,25,324
  •  2019లో జక్కంపూడి రాజా ఇంద్రవందిత్‌ సమర్పించిన అఫిడివిట్‌లో ఆరు కేసులున్నట్లు ప్రస్తావించారు. ఒక కేసు ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా ఎత్తివేస్తే, మిగతా కేసులు న్యాయస్థానంలో వీగిపోయాయి. ప్రస్తుతం ఒక కేసు మాత్రమే న్యాయస్థానంలో ఉన్నట్లు ప్రస్తావించారు.

    నియోజకవర్గం: అమలాపురం

​​​​​​​

ఆర్డీవో కేశవర్ధన్‌రెడ్డికి నామినేషన్‌ పత్రాలందిస్తున్న ఆనందరావు

  •  అభ్యర్థి: అయితాబత్తుల ఆనందరావు
  •  పార్టీ: తెదేపా (కూటమి అభ్యర్థి)
  •  విద్యార్హత: బీఏ, బీఎల్‌
  •  కేసులు: మూడు క్రిమినల్‌ కేసులున్నాయి
  •  చరాస్తులు: భార్య పేరున 50 గ్రాములు, పెద్దకుమారుడు వద్ద 300 గ్రాములు, చిన్న కుమారుడి వద్ద 30 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. ఒక కారు, రెండు బైక్‌లు ఉన్నాయి.
  •  స్థిరాస్తులు: వ్యవసాయ భూములు ఉప్పలగుప్తం మండలం ఎస్‌.యానాంలో ఆనందరావు పేరున 3.32 ఎకరాలు, భార్య పేరున 24 సెంట్లు, కామనగరువు పంచాయతీ పరిధిలో భార్య పేరున ఒక ఎకరం వ్యవసాయేతర భూమి, ఎస్‌.యానాంలో 217 చదరపు అడుగుల్లో సొంత నివాసం ఉన్నాయి.
  •  అప్పులు: 8.08 లక్షలు ఉన్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని