logo

రూ.6 కోట్ల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం

రావులపాలెం మండలం గోపాలపురం చెక్‌ పోస్టు వద్ద సోమవారం ఎటువంటి పత్రాలు లేకుండా లాజిస్టిక్‌ వాహనంలో తరలిస్తున్న 9.530 కేజీల బంగారం, 1.871 కేజీల వెండి వస్తువులను ఎస్‌ఎస్‌టీ బృందం, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 30 Apr 2024 06:23 IST

గోపాలపురం చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేస్తున్న సీఐ ఆంజనేయులు

రావులపాలెం పట్టణం: రావులపాలెం మండలం గోపాలపురం చెక్‌ పోస్టు వద్ద సోమవారం ఎటువంటి పత్రాలు లేకుండా లాజిస్టిక్‌ వాహనంలో తరలిస్తున్న 9.530 కేజీల బంగారం, 1.871 కేజీల వెండి వస్తువులను ఎస్‌ఎస్‌టీ బృందం, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.6,73,16,132 కోట్లని వాహనంలో సిబ్బంది వద్ద ఉన్న పత్రాల్లో పేర్కొన్నారని సీఐ ఆంజనేయులు తెలిపారు. విజయవాడ నుంచి అమలాపురం, భీమవరం ప్రాంతాల్లోని లలిత, మలబార్‌, తదితర బంగారు ఆభరణాల దుకాణాలకు వీటిని తరలిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీల్లో సీఐ, ఎస్‌ఎస్‌టీ టీం ఇన్‌ఛార్జి పట్టాభి సీతారామయ్య, సిబ్బంది విజయకుమార్‌, రాజశేఖర్‌ వీటిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో తరలిస్తున్నందున ఎన్నికల కమిషన్‌ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉందని సీఐ తెలిపారు. ఉన్నతాధికారుల ఉత్తర్వుల ప్రకారం ఆదాయ పన్ను శాఖ అధికారులకు వివరాలు పంపిస్తామన్నారు.


తనిఖీల్లో రూ.15 లక్షలు స్వాధీనం

తాళ్లరేవు: కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి.మల్లవరం చెక్‌పోస్టు వద్ద సోమవారం సాయంత్రం సెబ్‌ అధికారులు, పోలీసులు సంయుక్తంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. యానాం నుంచి తాళ్లరేవు వెళ్తున్న ద్విచక్ర వాహనదారు రూ.15 లక్షలు తీసుకువెళ్తున్నారు. తగిన ఆధారాలు లేకపోవడంతో పట్టుపడిన నగదును ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారికి అప్పగించినట్లు సెబ్‌ ఎస్సై రామశేషయ్య తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని