logo

మాదిగ జాతి ద్రోహి జగన్‌

మాదిగ జాతి ద్రోహి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎన్నికల్లో ఓడించాలని ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు.

Published : 01 May 2024 05:36 IST

ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు 

కరపత్రాలను ఆవిష్కరిస్తున్న వెంకటేశ్వరరావు, నాయకులు

దేవీచౌక్‌, న్యూస్‌టుడే: మాదిగ జాతి ద్రోహి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎన్నికల్లో ఓడించాలని ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ అయిదేళ్లలో మాదిగల సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తే భవిష్యత్తు ఉండదన్నారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తేనే మాదిగలకు న్యాయం జరుగుతుందన్నారు. తానేటి వనిత హోం మంత్రిగా ఉన్నా కనీసం ఒక్క హోంగార్డును కూడా నియమించలేని దుస్థితిలో ఉన్నారన్నారు. వైకాపా హయాంలో దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు జరిగినా నోరు విప్పలేదన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న కూటమికే తమ మద్దతు అని స్పష్టం చేశారు. దళిత వర్గాల ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు చెట్టే రాజు మాట్లాడుతూ దళిత డ్రైవర్‌ను చంపి డోర్‌ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును పక్కన కూర్చోబెట్టుకుంటున్నారని ఆరోపించారు. సీతానగరంలో ప్రసాద్‌కు శిరోముండనం జరిగితే ఇంతవరకు దోషులపై చర్యలు లేవన్నారు. అంబేడ్కర్‌ విదేశీ విద్య పథకానికి జగన్‌ తన పేరు పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. సీమాంధ్ర ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ప్రస్తావనలేని జగన్‌కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. చంద్రబాబుకు మద్దతుగా ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. నవ్యమాదిగ చర్మకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేజెండ్ల సుబ్బారావు, బేడబుడగ జంగం రాష్ట్ర అధ్యక్షుడు వనం నాగేశ్వరరావు, చెట్టే సుజన్‌రావు, కావూరి వరలక్ష్మి, దిగమర్తి బెంజుమన్‌, పల్లాబత్తుల సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని