logo

రెండు రోడ్లు వేసి అదే అభివృద్ధి అంటారా?

రాజధానిని ఏర్పరుచుకోలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రం ఉందని ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. కొవ్వూరులో ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, తెదేపా సీనియర్‌ నాయకులు అచ్చిబాబుతో కలిసి శుక్రవారం కొవ్వూరు మండలం దొమ్మేరు, చాగల్లు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు.

Published : 04 May 2024 04:51 IST

ఎంపీ కూటమి అభ్యర్థి పురందేశ్వరి

చిన్నారిని ఎత్తుకున్న పురందేశ్వరి, చిత్రంలో ముప్పిడి, అచ్చిబాబు

చాగల్లు, కొవ్వూరు పట్టణం: రాజధానిని ఏర్పరుచుకోలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రం ఉందని ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. కొవ్వూరులో ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, తెదేపా సీనియర్‌ నాయకులు అచ్చిబాబుతో కలిసి శుక్రవారం కొవ్వూరు మండలం దొమ్మేరు, చాగల్లు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. పురందేశ్వరి మాట్లాడుతూ వైకాపా పాలనలో అభివృద్ధి నాస్తి.. ప్రచారం జాస్తి అని విమర్శించారు. గోదావరి ప్రక్షాళనకు కేంద్రం ఇచ్చిన రూ.50 కోట్లు ఖర్చు చేయలేదన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో రెండుచోట్ల రోడ్లువేసి, అదే అభివృద్ధి అనడం విచిత్రమన్నారు. నాణ్యతలేని పనులు చేసి నాయకులు జేబులు నింపుకొంటున్నారన్నారు. రాజమహేంద్రవరం బ్లేడ్‌బ్యాచ్‌లకు, ఇతర మాఫియాలకు నిలయంగా మారిందన్నారు. వంతెనల మనుగడ ప్రశ్నార్థకం అవుతున్నా యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. సుబ్బరాయచౌదరి, రామకృష్ణ, చిన్ని, హరిబాబ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని