logo

పండుటాకులకు తప్పని పింఛను ప్రయాస

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో పింఛను సొమ్ము తీసుకునేందుకు వృద్ధ్దులు అవస్థలు పడుతున్నారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులకు సైతం సొమ్ము కోసం దూర ప్రాంతాలలో ఉన్న బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.

Published : 09 May 2024 04:55 IST

పింఛను సొమ్ము కోసం కోరుకొండ నుంచి వచ్చిన వృద్ధులు

గోకవరం, న్యూస్‌టుడే: ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో పింఛను సొమ్ము తీసుకునేందుకు వృద్ధ్దులు అవస్థలు పడుతున్నారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులకు సైతం సొమ్ము కోసం దూర ప్రాంతాలలో ఉన్న బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. జగ్గంపేట మండలం వెంగయమ్మపురం గ్రామానికి చెందిన జొమ్మల తాతబ్బాయికి 74 ఏళ్లు. ప్రతి నెల వచ్చే పింఛను సొమ్ముతోనే ఆధారపడి రోజులు వెళ్లదీస్తున్నారు. ఈసారి పింఛను సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ చేశామని అధికారులు చెప్పడంతో వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. మాకు ఇక్కడ ఎక్కడా బ్యాంకు ఖాతాలు లేవు కదా ఎక్కడ జమ చేశారని అధికారులను ప్రశ్నించారు. మీరు గతంలో ఖాతా కలిగి ఉన్న తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామంలోని డీసీసీబీ బ్యాంకులో జమచేసినట్లు అధికారులు సమాధానమిచ్చారు. దీంతో ఆ సొమ్ము కోసం వృద్ధులు మండుటెండలో అవస్థలు పడుతూ సుమారు 28 కి.మీ. ప్రయాణించి కోరుకొండ వచ్చారు. అవస్థలు పడుతూ బ్యాంకు వద్దకు చేరుకొని సొమ్ము తీసుకున్నారు. వచ్చే రూ.మూడు వేలలో రెండు వందలకు పైగా ఖర్చులు కావడంతో పాటు తీవ్ర అవస్థలు పడ్డామని వృద్ధులు వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని