logo

‘సీఐడీ పోలీసుల తీరు దారుణం’

సీఐడీ పోలీసుల వ్యవహార శైలి రోజురోజుకు దిగజారిపోతుందని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ విమర్శించారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి

Published : 02 Oct 2022 05:32 IST

పట్టాభిపురం, న్యూస్‌టుడే: సీఐడీ పోలీసుల వ్యవహార శైలి రోజురోజుకు దిగజారిపోతుందని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ విమర్శించారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సీఐడీ పోలీసులు అసలు పని పక్కనపెట్టి కొసరు పనులు ఎక్కువ చేస్తున్నారు. ప్రభుత్వం చేసే తప్పుడు పనుల్ని ప్రశ్నించిన సోషల్‌ మీడియా జర్నలిస్టుల దగ్గర నుంచి తెదేపా నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే, ఎంపీలపై వెంటనే తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేసి దాడులకు పాల్పడుతున్నారన్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్‌ ఇంటికి వెళ్లి ఆయన ఇంట్లో లేరని చెబుతున్నా వినకుండా పసి పిల్లల్ని విచారణ పేరుతో కొట్టడం దారుణమని మండిపడ్డారు. పోలీసులు ఇప్పటికైనా ఆలోచించి మసలుకుంటే మంచిది. లేదంటే ప్రైవేటు కేసులు వేసి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని