logo

బకాయిలు చెల్లించాలని ఉద్యోగుల వినతి

ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ బకాయిలు తక్షణమే చెల్లించాలని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజా రమేష్‌ మోహన్‌ డిమాండ్‌ చేశారు.

Published : 22 Mar 2023 05:26 IST

కలెక్టర్‌ విజయకృష్ణన్‌కు వినతి పత్రం ఇస్తున్న  ఉద్యోగ సంఘం నేతలు రాజా రమేష్‌ మోహన్‌, సురేష్‌బాబు

బాపట్ల, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ బకాయిలు తక్షణమే చెల్లించాలని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజా రమేష్‌ మోహన్‌ డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్‌ విజయకృష్ణన్‌కు ఉద్యోగుల సంఘం నేతలు వినతిపత్రాన్ని మంగళవారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి నెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు, పింఛనర్లకు పింఛను సొమ్ము జమ చేయాలని కోరారు. సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేయాలన్నారు. ఏపీ అమరావతి జేఏసీ ఇచ్చిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా నల్లబ్యాడ్జీలు ధరించి మంగళవారం నుంచి ఏప్రిల్‌ 5 వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ఉద్యోగులు పని చేస్తారన్నారు. ఉద్యోగులు ఐక్యంగా ఉండి హక్కుల సాధన, సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు. నేతలు సురేష్‌బాబు, సుమంత్‌, చంద్రశేఖర్‌, దిలీప్‌, ఓంకార్‌, శ్రీనివాసరావు, అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

వేమూరు, కొల్లూరు: ఉద్యోగ సంఘాల ఏపీజేఏసీ నాయకుల పిలుపు మేరకు నియోజకవర్గంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విధులను నిర్వహించినట్లు ఏపీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు రాజారమేష్‌ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని