logo

Missing: అదృశ్యానికి 1000 రోజులు.. అంతులేని ఆవేదనలో తల్లిదండ్రులు

పుట్టినరోజు నాడే పాటిబండ్లలో పాప కీర్తి అదృశ్యమై వెయ్యిరోజులు గడుస్తున్నాయి. కన్నపేగు ఆచూకీ కోసం అంతుపట్టని ఆవేదనతో  తల్లిదండ్రులు పాటిబండ్ల రమేష్‌-శ్రీలక్ష్మి తల్లడిల్లుతున్నారు.

Updated : 24 Jul 2023 09:28 IST

పాటిబండ్లలో పుట్టినరోజు నాడే మాయమైన కీర్తి
దర్యాప్తులో చేతులెత్తేసిన పోలీసులు

పాటిబండ్ల (పెదకూరపాడు), న్యూస్‌టుడే : పుట్టినరోజు నాడే పాటిబండ్లలో పాప కీర్తి అదృశ్యమై వెయ్యిరోజులు గడుస్తున్నాయి. కన్నపేగు ఆచూకీ కోసం అంతుపట్టని ఆవేదనతో  తల్లిదండ్రులు పాటిబండ్ల రమేష్‌-శ్రీలక్ష్మి తల్లడిల్లుతున్నారు. 2020 అక్టోబరు 26న (బాలిక పుట్టినరోజు)న ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమైంది. 1000 రోజులు గడుస్తున్నా ఆచూకీ లేదు. కేసు విచారణలో ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్సైలు బదిలీపై వెళ్లటంతో కేసు విచారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన మారింది. గ్రామంలో సీసీ కెమెరాలు పరిశీలించినా, పిల్లల అపహరణ ముఠాలను విచారించినా ప్రయోజనం లేదు.

కేసులో పురోగతి లేక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. వారు వెతకని ప్రదేశం లేదు. తిరగని గుడి లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు చేపట్టి పాపను అప్పగించాలంటూ సామాజిక మాధ్యమాల ద్వారా రమేష్‌ అభ్యర్థిస్తున్నాడు. కుమార్తె మీద మనోవేదనతో తల్లి శ్రీలక్ష్మి అనారోగ్యానికి గురైంది. పేరేచర్ల స్టోన్‌ క్రషర్‌లో రాత్రిపూట క్రేన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తూ ఉదయం వేళ, సెలవు రోజుల్లో పలుచోట్ల పాప ఆచూకీ కోసం రమేష్‌ గాలిస్తున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా అమ్మాయిని వెతికి పెట్టి తమకు అప్పగించాలని వారు వేడుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు