logo

ఎన్నికల ప్రచారంలో వాలంటీరు హల్‌చల్‌పై ఫిర్యాదు

మండలంలోని కారంపూడిపాడు గ్రామంలో ఈ నెల 22న వైకాపా అభ్యర్థి బలసాని కిరణ్‌కుమార్‌కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వాలంటీరు కె.నరసింహరావు పాల్గొన్నారు.

Published : 29 Mar 2024 04:14 IST

కారంపూడిపాడు(వట్టిచెరుకూరు), న్యూస్‌టుడే : మండలంలోని కారంపూడిపాడు గ్రామంలో ఈ నెల 22న వైకాపా అభ్యర్థి బలసాని కిరణ్‌కుమార్‌కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వాలంటీరు కె.నరసింహరావు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ఈ విషయంపై ప్రత్తిపాడు తెలుగు యువత అధ్యక్షుడు నాగిసెట్టి నాగరాజు గురువారం ఎంపీడీవో శేషగిరిరావును కలసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న గ్రామంలోని అనేక మంది వాలంటీర్లుపై చర్యలు తీసుకోవాలని నాగరాజు కోరారు.


వాట్సప్‌ గ్రూపులో ప్రచారం.. వాలంటీరు తొలగింపు

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే : తన పరిధిలో ఉన్న ప్రజల వాట్సప్‌ గ్రూపులో సీˆఎం జగన్‌కు అనుకూలంగా ప్రచారం చేసిన వెంగళాయపాలేనికి చెందిన వాలంటీరు హిమబిందును అధికారులు గురువారం విధుల నుంచి తొలగించారు. స్థానిక తహసీˆల్దారు కార్యాలయంలో బుధవారం జరిగిన రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో ఐటీడీపీˆ నాయకుడు పంచుమర్తి శేషు ఈఆర్వో పి.శ్రీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈఆర్వో అధికారులతో విచారణ చేపట్టారు. వైకాపాకు అనుకూలంగా వీడియోను పంపి ప్రచారం చేసినట్లు విచారణలో తేలడంతో వాలంటీరును తొలగించినట్లు ఈఆర్వో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని