logo

శిరోముండనం కేసులో శిక్ష విధించడం హర్షణీయం

శిరోముండనం కేసుల్లో నిందితులకు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు జైలుశిక్ష, జరిమానా విధించడం హర్షణీయమని భీమ్‌ భారత్‌ రాష్ట్ర అధ్యక్షుడు పాగళ్ల ప్రకాష్‌ అన్నారు.

Published : 18 Apr 2024 05:31 IST

 

లాడ్జి కూడలిలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ప్రదర్శన నిర్వహిస్తున్న పాగళ్ల ప్రకాష్‌, వివిధ సంఘాల నాయకులు

బ్రాడీపేట(గుంటూరు), న్యూస్‌టుడే: శిరోముండనం కేసుల్లో నిందితులకు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు జైలుశిక్ష, జరిమానా విధించడం హర్షణీయమని భీమ్‌ భారత్‌ రాష్ట్ర అధ్యక్షుడు పాగళ్ల ప్రకాష్‌ అన్నారు. వైకాపా ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు విధించడాన్ని స్వాగతిస్తూ గుంటూరు లాడ్జికూడలిలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద భీమ్‌ భారత్‌, దళిత, ప్రజా సంఘాల ఆధ్వరంలో బుధవారం ప్రదర్శన చేపట్టారు. ఈసందర్భంగా ప్రకాష్‌ మాట్లాడుతూ వైకాపా ఎమ్మెల్సీ త్రిమూర్తులును రాజకీయంగా బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. మున్ముందు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. శిరోముండనం కేసులో తుది వరకు ఆత్మగౌరవంతో సాక్ష్యం చెప్పిన సాక్షులకు, బాధితులకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలన్నారు. హైకోర్టు న్యాయవాది వైకే మాట్లాడుతూ త్రిమూర్తులు రెండున్నర దశాబ్దాల కిందట సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఐదుగురు దళితులను అనేక రకాలుగా హింసించి, ఇద్దరికి శిరోముండనం చేయడం హేయమన్నారు. విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు త్రిమూర్తులుతో పాటు 9 మందికి 18 నెలల జైలుశిక్ష, రూ.2.5 లక్షల జరిమానా విధించడం హర్షణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు శిఖ సురేష్‌, కాకి నాగేశ్వరరావు, సాదు మాల్యాద్రి, చిన్న డేవిడ్‌ విలియమ్స్‌, సుధాకర్‌, గంటా ప్రభుదాసు, సమత, పోతురాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని