logo

స్వచ్ఛమైన నీరు ఎక్కడ.. కిలారి

పుర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య అనేక సందర్భాల్లో వేదికలపై నుంచి చెప్పారు.

Published : 02 May 2024 06:30 IST

మురుగు కాలువలో పైపులు

12 వార్డులో పైపులైనుకు లీకుతో వృథాగా పోతున్న నీరు

పొన్నూరు, న్యూస్‌టుడే: పుర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య అనేక సందర్భాల్లో వేదికలపై నుంచి చెప్పారు. కానీ రంగు మారిన నీరు వస్తోందని, అంటువ్యాధులు ప్రబలుతాయని ప్రజలు వాపోతున్నారు. పొన్నూరు పట్టణ పరిధి నిడుబ్రోలు ఎస్టీ కాలనీ, 10వ వార్డు ఎస్టీకాలనీ, ముబారక్‌నగర్‌, ఇందిరాకాలనీ, 23వ వార్డు శ్మశాన వాటిక రోడ్డు, 9వ వార్డులోని రైలుపేట తదితర ప్రాంతాల్లో మంచినీటి పైపులైన్లు మురుగు కాలువలో ఉన్నాయి. కొన్ని కుళాయిలు చుట్టూ మురుగు చేరింది. పైపులైను లీకు ఏర్పడి నీరు కలుషితమవుతాయని, పైపులైను మార్చమని అనేక సార్లు స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని కాలనీ వాసులు వాపోతున్నారు.

  • కొంత కాలంగా శాంతినగర్‌, విద్యానగర్‌, వీవర్స్‌ కాలనీ, టీచర్స్‌కాలనీ, నేతాజీనగర్‌, శ్రీనగర్‌ కాలనీ తదితర ప్రాంతాల్లో మంచినీరు రంగు మారి వస్తున్నాయి. ఆ నీరు తాగడానికి ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. నిడుబ్రోలు ప్రాంతంలో పైపులైనుకు లీకు ఏర్పడి నెల రోజులు గడిచినా ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టలేదు. ఆ ప్రాంతమంతా బురదమయంగా మారడంతో రాకపోకలు నిర్వహించడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు.


బ్లీచింగ్‌ కూడా కలపడం లేదు

మా వార్డు శివారులో పైపులైన్‌కు లీకుకు మరమ్మతులు చేశారు కానీ వాటి గుంతలు పూడ్చలేదు. గుంతల్లో నీరు నిలుస్తోంది. అధికారులు గుంతలను పూడ్పిండంలేదు. సరఫరా చేసే నీరు వాసన కూడా వస్తుంది. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మంచి నీటిలో బ్లీచింగ్‌ కూడా కలపడం లేదు.    -బోల్లెదు సోమయ్య, 13వ వార్డు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని